Asianet News TeluguAsianet News Telugu

హీరో కార్తీ అభిమానుల సంచలన నిర్ణయం, గ్రేట్ అంటున్న జనాలు..?

తమ అభిమాన హీరో కోసం ఎం చేయడానికైనా వెనకాడరు ఫ్యాన్స్. రకరకాలుగా అమ అభిమానాన్ని వెల్లడిస్తుంటారు. ఈక్రమంలోనే తమిళయంగ్ హీరో కార్తీ అభిమానులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.. వారు తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలుసా..?  

Tamil Hero Karthi Fans Shocking Decision JMS
Author
First Published Oct 20, 2023, 1:21 PM IST


సినిమా నటులకు ప్రాణాలిచ్చే అభిమానులు ఉంటారు. రకరకాలుగా వారి మీద అభిమానాన్నిచూపిస్తుంటారు. చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా సినిమా తారలందరికి అభిమానులు ఉంటారు. ఈక్రమంలో తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉండగా.. అందులో కార్తీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉది. కార్తీకి తమిళనాట, తెలుగులోనే కాదు జపాన్ లో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమధ్య కార్తీ కోసం జపాన్ నుంచి ప్రత్యేకంగా చెన్నై వచ్చారు కూడా., 

ఇకపోతే తమిళనాడులో కార్తీ ఫ్యాన్స్ రకరకాల కార్యక్రమాలతో ఆయనమీద ప్రేమను చాటుకుంటున్నారు. తాజాగా కార్తీకి సంబంధించిన జపాన్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈసినిమా నుంచితాజాగాటీజర్ రిలీజ్ అవ్వగా.. అది అందరిని ఆకట్టుకుంటోంది.   రేయ్ ఎన్ని బాంబులేసినా ఈ జపాన్ ను ఎవరూ ఏం పీకలేరురా” అంటూ టీజర్ లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా బంగారం చుట్టూ తిరిగే యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. 

ఇక తాజాగా  కార్తీ అభిమానులు చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా కార్తీ 25వ సినిమా కావడంతో కార్తీ ఫ్యాన్స్ 25 రోజుల పాటు 25,000 మందికి ఫ్యాన్స్ అన్నదానం చేస్తున్నారు.కార్తీ నిర్వహిస్తున్న ఉళవన్ సేవా ట్రస్ట్ ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చెన్నైలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కోరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని తెలుస్తోంది. 

కార్తీ అభిమానులు పేదల కడుపు నింపేలా తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ చిత్ర బృందం ఈ అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.జపాన్ సినిమా కార్తీ (Karthi) కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది. జపాన్ సినిమా ఫుల్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios