ఆయన నటించిన ఓ తమిళ సినిమా తెలుగులో ప్రేమిస్తే పేరుతో విడుదల చేయగా.. భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

ప్రముఖ తమిళ సినీ నటుడు భరత్, జెస్లీ జోషువా దంపతులు..పండంటి కవలపిల్లలకు జన్మనిచ్చారు. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ చిత్రంతో భరత్.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు పరిచయమయ్యాడు.

ఆ తర్వాత ‘కాదల్‌, ‘చెల్లమే’, ‘నేపాలీ’ తదితర చిత్రాలలో నటించే హీరోగా అగ్రస్థానం చేరుకున్నారు. భరత్ తమిళ సినిమాలన్నీ దాదాపు తెలుగులోకి అనువాదం అవుతూ ఉంటాయి. ఆయన నటించిన ఓ తమిళ సినిమా తెలుగులో ప్రేమిస్తే పేరుతో విడుదల చేయగా.. భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

Scroll to load tweet…

కాగా..కొన్ని సంవత్సరాల క్రితం భరత్‌ దంతవైద్యనిపుణురాలు జెస్లీ జోషువాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జెసీకి ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఈ విషయాన్ని భరత్‌ ఆదివారం తన ట్విటర్‌లో ప్రకటించారు. తనకు కవలలు జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయనపేర్కొన్నారు.