ప్రముఖ తమిళ దర్శకుడు పేరరుసు మహిళలపై తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పెణ్‌ విలై వెరుం రూ.999 మట్టుమే’ అనే చిత్ర ఆడియో వేడుకలో పేరరుసు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. 

ప్రముఖ తమిళ దర్శకుడు పేరరుసు మహిళలపై తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పెణ్‌ విలై వెరుం రూ.999 మట్టుమే’ అనే చిత్ర ఆడియో వేడుకలో పేరరుసు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలపై పేరరుసు మాట్లాడారు. 

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం పురుషులు అని అనుకుంటారు. కానీ దానికి కారణం కొందరు మహిళలే అంటూ పేరరుసు కామెంట్స్ చేశారు. టిక్ టాక్ లాంటి షేరింగ్ యాప్స్ లో అసభ్యకరమైన, అశ్లీలమైన వీడియోలని కొందరు మహిళలు షేర్ చేస్తూ ఉంటారు. ఆ దారుణాలు చూడలేకున్నాం. 

అలాంటి మహిళలని గుర్తించి వారిని అరెస్ట్ చేయాలి అని పేరరుసు వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చారు. మన దేశ సంస్కృతి ఈ మొబైల్ ఫోన్స్ వల్ల మంట గలిసిపోతోంది. తల్లి దండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇవ్వొద్దని సూచించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ రూపొందించిన సినిమా ‘పెణ్‌ విలై వెరుం రూ.999 మట్టుమే. కాబట్టి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని పేరరుసు అన్నారు. 

టిక్ టాక్ లాంటి షేరింగ్ యాప్స్ లో అసభ్యకరమైన వీడియోలు ఉన్నమాట వాస్తవమే. కానీ పేరరుసు మహిళల్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా తీవ్ర వివాదం అయ్యేలా ఉన్నాయి. పేరరుసు వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఎలా స్పందిస్తారో చూడాలి. పేరరుసు తమిళంలో ఇళయదళపతి విజయ్ తో శివకాశి చిత్రాన్ని తెరకెక్కించారు. అర్జున్ తో తిరువణ్ణామలై చిత్రం తెరకెక్కించారు. రచయితగా, నటుడిగా కూడా చేశారు.