Rajinikanth : ఆగలేకపోతున్న అట్లీ.. రజనీకాంత్ తో మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ర్..

తమిళ యంగ్ స్టార్ డైరెక్టర్ అట్లీ..మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు.. డిఫరెంట్ గా మాట్లాడి ట్రోల్స్ కు గురైన దర్శకుడు.. ఈసారి రజినీకాంత్ తో సినిమాపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. 
 

Tamil Director Atlee Comments about Rajinikanth Movie JMS

సౌత్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో అట్లీ కూడా ఒకరు. డియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమన పైజ్ ను క్రియేట్ చేసుకున్నాడు అట్లీ. ఇక తమిళ సినిమాలతో ఫేమస్ అయిన దర్శకుడు..ఈ ఏడాది  షారుక్‌ ఖాన్‌ హీరోగా బాలీవుడ్ లో జవాన్ సినిమా చేసి.. ఇండస్ట్రీకి బ్లాక్‌ బస్టర్ హిట్టు అందించాడు. ఈ సినిమా 1000కోట్లు దాటి భారీగా కలెక్షన్లు సాదించడంతో.. అట్లీ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దాంతో ఇండియాలోనే వన్ ఆఫ్‌ ది లీడింగ్‌ స్టార్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న అట్లీ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నా..

అయితే అట్లీ నెక్ట్స్ సినిమాపై అధికారికంగా  ఎటువంటి ప్రకటన రాలేదు. కాని అట్లీ ఈలోపు చేసిన కామెంట్స్ అందరిచేత ఔరా అనిపిస్తున్నాయి. జవాన్ సక్సెస్ తరువాత తన నెక్ట్స్ మూవీ ఏకంగా  3000 కోట్లు వసూళు చేయబోతుందన్ని అప్పుడు అన్నారు అట్లీ. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నట్లు చెప్పారు. వారిద్దరితో సినిమా చేస్తే  3000 కోట్లు ఈజీగా క్రాస్ అవుతుందన్నారు. దాంతో ఆయనపై గట్టిగా ట్రోల్స్ వచ్చాయి. 1000 కోట్ల సినిమా ఒక్క సారి చేసినందుకే...  ఇంత ఓవరాక్షన్ అవసరమా? అనినెటిజన్లు ఆడేసుకున్నారు. 

World Cup 2023: వరల్డ్ కప్ పై రజినీకాంత్ జోస్యం, ఈసారి కప్ ఎవరిదంటే..?

అంతటితో ఆగకుండా.. మరోసారి.. జవాన్ సినిమాను ఆస్కార్ కు తీసుకెళ్తాను అన్నాడు  అట్లీ... అప్పుడు కూడా ట్రోల్స్ గట్టిగానే వచ్చాయి. ఇక ఇంకోసారి.. తనకు హాలీవుడ్ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని.. వెంటనే రమ్మంటున్నారంటూ  కామెంట్స్ చేశాడు.  తాను త్వరలోనే స్పానిష్ సినిమా కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా అట్లీ తనకు హాలీవుడ్ సినిమా అవకాశాలు కల్పించారని  చేసిన కామెంట్స్ ఆయనపై భారీ సెటైర్లకు కారణం అయ్యాయి. 

ఇక తాజా ఇంటర్వ్యూలో రజినీకాంత్‌ తో చేయబోయే సినిమా గురించి కూడా డిఫరెంట్ కామెంట్స్ చేయడంతో పాటు.. ఈమూవీపై  క్లారిటీ ఇచ్చాడు అట్లీ. తాను రజినీకాంత్‌కు వీరాభిమానినని.. అంతే కాదు రజినీకాంత్ తనను ముద్దుగా కన్నా అని పిలుస్తారని.. తనతో సినిమాకు సూపర్ స్టార్ ఎప్పుడూ రెడీగానే ఉంటాడు అన్నారు.  తలైవా నటించిన దళపతి సినిమా చూసిన తర్వాతే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చానని అన్నాడు.

రోబో సినిమాకు శంకర్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశానని చెప్పాడు అట్లీ. తలైవా తనతో సినిమాకు ఎప్పుడూ రెడీగా ఉంటాడని.. రెండు మూడు కథలు కూడా చర్చించుకున్నామని.. కాని ఆయనకు సరిపోయే పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌ సిద్దం కాలేదని, భాషా నుంచి మించిపోయేలా సినిమా ఉండాలని తాను అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అట్లీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనతో సినిమా తీయ్యడమేమో కాని.. అట్లీ ఇలా చెప్పడం చిత్రంగా ఉందంటున్నారు సినిమా జనాలు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios