శర్వానంద్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సరైన కథ తో వస్తే డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఎవరు ఎలాంటి కొత్త పాయింట్ చెప్పినా వాళ్ళను దర్శకుడిగా పరిచయం చేయడానికి వెనుకాడడం లేదు. ముఖ్యంగా వైవిధ్యమైన చిత్రాలకు ఆయన కేరాఫ్ ఎడ్రస్ గా మారుతున్నారు. 

ప్రస్తుతం సుధీర్ వర్మ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంటే ఆ తర్వాత వరుసగా   కొత్త దర్శకులతో చేయనుండడం విశేషంగా మారింది. పెద్ద పెద్ద డైరక్టర్స్ శర్వానంద్ తో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నా కథే ముఖ్యం అని ముందుకు వెళ్తున్నారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. 

దాదాపు పదకొండేళ్ల క్రితం నీవల్లే ..నీవల్లే చిత్రం డైరక్ట్ చేసి, ఇంతకాలం నటుడుగా, కొరియోగ్రాఫర్ గా కంటిన్యూ అయిపోతూ వచ్చారు. అయితే ఆయనలో దర్శకుడు నిద్రపట్టనివ్వకపోవటంతో ఓ మంచి కథ తీసుకుని తనకు పరిచయం ఉన్న హీరోలను కలవటం జరిగింది. శర్వానంద్ కు ఆ పాయింట్ నచ్చటం, పూర్తి స్క్రిప్టుతో రమ్మనమనటం వెంటవెంటనే జరిగిపోయాయి. ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.  త్వరలోనే ఈ చిత్రం విషయమే అఫీషియల్ ప్రకటన వస్తుంది. 

శర్వానంద్ తాజా ప్రాజెక్టుల విషయానికి వస్తే... సుధీర్‌వర్మ సినిమాతో పాటు శర్వానంద్ నటిస్తోన్న చిత్రం '96' తమిళ రీమేక్. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్‌నే తెలుగు తెరకు పరిచయం అవుతూ రూపొందనున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.