నటుడు శరవణన్ మరో ఇంటి సభ్యుడు దర్శకుడు చేరన్ ని కించపరిచే విధంగా మాట్లాడాడు. దీన్ని కమల్ హాసన్ కూడా తప్పుబట్టారు. శరవణన్ నోరు జారడంతో బిగ్ బాస్ హౌస్ నుండి అతడిని అర్ధంతరంగా బయటకి పంపించేశారు.
తమిళంలో బిగ్ బాస్ మూడో సీజన్ నడుస్తోంది. ఇందులో పాల్గొన్న కంటెస్టంట్స్ లో నటుడు శరవణన్ ఒకరు. బిగ్ బాస్ ఇంటిసభ్యులతో ప్రతీ శనివారం, ఆదివారాల్లో హోస్ట్ కమల్ హాసన్ మాట్లాడుతుంటారు. . అలా ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న దర్శకుడు చేరన్ ఒక టాస్క్ లో అసభ్యంగా ప్రవర్తించాడంటూ మరో సభ్యురాలు నటి మీరా మిథున్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనంతరం ఈ టాపిక్ గురించి చర్చ వచ్చినప్పుడు కమల్ హాసన్ చేరన్ ని మద్దతుగా నిలవడమే కాకుండా.. నటి మీరామిథున్ ని తప్పుబట్టారు. అక్కడితో టాపిక్ ఆగలేదు. అలాంటి సంఘటనలకు నిజజీవితంలో ఎవరైనా పాల్పడ్డారా..? అని బిగ్ బాస్ ఇంటి సభ్యులను ప్రశ్నించారు. దీంతో నటుడు శరవణన్ లేచి తాను కాలేజ్ లో చదువుతున్న సమయంలో అమ్మాయిలను టచ్ చేయడం కోసం బస్ ఎక్కేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు.
ఆయన మాటలకు కంటెస్టంట్స్, కమల్ హాసన్ నవ్వినప్పటికీ బయట ప్రపంచంలో శరవణన్ మాటలు తీవ్ర ప్రభావం చూపాయి. ఆయన మాటలకు మహిళల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా అతడిపై మండిపడింది. దీంతో శరవణన్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. దీనికి తోడు నటుడు శరవణన్ మరో ఇంటి సభ్యుడు దర్శకుడు చేరన్ ని కించపరిచే విధంగా మాట్లాడాడు.
దీన్ని కమల్ హాసన్ కూడా తప్పుబట్టారు. శరవణన్ నోరు జారడంతో బిగ్ బాస్ హౌస్ నుండి అతడిని అర్ధంతరంగా బయటకి పంపించేశారు. శరవణన్ ని బిగ్ బాస్ ఇంటి నుండి పంపడంతో ఇంటి సభ్యులు ఆయనకు ఏమైనా జరిగిందా..? కుటుంబానికి ఏమైనా జరిగిందా..? అంటూ తెగ బాధపడిపోయారు. మరి నిజం తెలిసిన తరువాత రియాక్ట్ అవుతారో!
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 8, 2019, 12:26 PM IST