Asianet News TeluguAsianet News Telugu

తమిళ స్టార్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్ కన్నుమూత

తమిళ స్టార్ హీరో.. విప్లవ నాయకుడు.. విజయ్ కాంత్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన కరోనా సోకడంతో మరణాంచారు. 

Tamil Actor Vijayakanth passed away Due Tested Carona Positive JmS
Author
First Published Dec 28, 2023, 9:07 AM IST

తమిళ స్టార్ హీరో.. విప్లవ నాయకుడు.. డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయ్ కాంత్ కన్ను మూశారు. మరోసారి ఆయన  ఆరోగ్య పరిస్థతి మరోసారి విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ కన్ను మూశారు. అయితే విజయ్ కాంత్ కు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది.  ఈమధ్యే ఆయన వెరీ సీరియస్ కండీషన్ నుంచి బయటపడ్డారు. జలుబు, జ్వరంతో హాస్పిటల్ కు వెళ్లిన ఆయన 20 రోజులకు పైగా వెంటిలేటర్ పై పోరాటం చేశారు. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించి విజయ్ కాంత్ తిరిగి క్షేమంగా ఇంటికి చేరారు.  తాజాగా మరోసారి విజయ్ కాంత్ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. 

విజయ్ కాంత్ మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను మంగళవారం కుటుంబసభ్యులు మియాట్ ఆసుపత్రికి తరలించారు. అయితే విజయ్ ను పరీక్షించిన వైద్యులు ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని గ్రహించారు. వాటికి సబంధించిన  టెస్టులు చేయగా కరోనా పాజిటీవ్ గా  నిర్ధారించారు. వైద్య పరీక్షల్లో విజయకాంత్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆయనకు వెంటిలేటర్‌ చికిత్స అందించారు అయినా ఫలితం లేకుండా పోయింది.  

విజయ్ కాంత్ మరణ వార్త విని అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.  అనారోగ్య కారణాలతో కొన్నేళ్లుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు విజయ్ కాంత్. కదలలేని పరిస్థితుల్లో ఉన్న కెప్టెన్ సినిమాలకు ఎప్పుడో దూరం అయ్యారు. ఇక కొన్నాళ్లుగా పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు.కిడ్నీ మార్పిడి, మధుమేహం, ఇలాఅనేక అనారోగ్య సమస్యలకు ఆయన ఎప్పటికప్పుడు హాస్పిటల్ కు వెళ్ళి ట్రీట్మెంట్ తో పాటు..పరీక్షలు కూడా చేయించుకుంటూ వస్తున్నారు. ఇంట్లోనే అది కూడా వీల్ చేైర్  సహాయంతో తిరుగుతూ.. విశ్రాంతి తీసుకుంటున్నారు విజయకాంత్‌.

తమిళంలో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్న విజయకాంత్‌కు నల్ల ఎంజీఆర్‌ అన్న పేరు ఉంది. అభిమానులు ఆయనను కెప్టెన్‌ అని పిల్చుకుంటారు. 1952 ఆగస్టు 25న జన్మించిన విజయకాంత్‌ పోలీసు పాత్రలలో మంచి పేరు తెచ్చుకున్నారు. సినీ నటుడుగా రాణిస్తూనే డీఎండీకే పార్టీని స్థాపించారు. అసెంబ్లీకి ఎన్నికయ్యారు కూడా. 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారు. విరుధాచలం, రిషివండియం నియోజకవర్గాల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios