Asianet News TeluguAsianet News Telugu

సూర్య, జ్యోతిక ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి అసలు కారణం.. తట్టుకోలేక స్పందించిన కార్తీ.!

సూర్య - జ్యోతిక కొన్ని నెలలుగా వేరుకాపురం ఉంటున్నట్లు వస్తున్న వార్తలపై కార్తీ స్పందించారు. జ్యోతికే కారణం అంటూ వచ్చిన రూమర్లను కొట్టిపారేశారు. ఈ సందర్భంగా కార్తీ మాటలు బాధ్వోగానికి గురి చేసేలా ఉన్నాయి. 
 

Tamil Actor Karthi Emotional Comments about Surya and Jyothika NSK
Author
First Published Sep 24, 2023, 1:31 PM IST


కోలీవుడ్ లో స్వీట్ కపుల్ గా సూర్య - జ్యోతికలు క్రేజ్ దక్కించుకున్నారు. వీరిని స్టార్ గా కంటే.. అన్నా వదిగానే చూస్తుంటారు అభిమానులు. ఇక సూర్య, జ్యోతికల పట్ల కార్తీ ఎంత గౌరవంగా, అభిమానంతో ఉంటారో తెలిసిందే. పలు సందర్భాల్లో ఆయన మాటలతో ఆ విషయాన్ని గుర్తుచేస్తూ వచ్చారు. ఇక తాజాగా కార్తీ తన కుటుంబ గురించి వస్తున్న కొన్ని వార్తలపై స్పందించారు. 

అన్న సూర్య, వదినమ్మ జ్యోతిక గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అయితే, కొద్దిరోజులుగా సూర్య - జ్యోతిక ఇంట్లో వారితో గొడవల కారణంగా వేరే కాపురం ఉంటున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు కారణం జ్యోతికనే అని కూడా అన్నారు. 2006లో సూర్య జ్యోతికను పెళ్లి చేసుకున్నారు. అసలు వీరి పెళ్లి తండ్రి శివకుమార్ కు ఇష్టం లేదని, సూర్యకు నో చెప్పలేక వివాహం జరిపించారంట. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని జ్యోతికకు కండీషన్ కూడా పెట్టారంట. 

కొన్నాళ్లు అందుకే జ్యోతిక సినిమాలకు దూరమైందని, కానీ ఇటీవల మళ్లీ సినిమాలు చేస్తుండటంతో శివకుమార్ కు నచ్చలేదని తెలుస్తోంది. ఇక జ్యోతికను సూర్య సమర్థించడంతో ఇద్దరూ వేరుగా ఉంటుంన్నారని ప్రచారం. ఈమేరకు జ్యోతికదే తప్పు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ బాగా స్ప్రెడ్ అయ్యింది. ఈ న్యూస్ చూసి తట్టుకోలేకపోయిన కార్తీ తాజాగా స్పందించారు. జ్యోతిక గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

ఆయన మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ జ్యోతికను నటిగా చూడలేదు. అమ్మలాగే చూశాను. ఆమె కూడా నన్ను వారి పిల్లల లాగే చూసింది. అమ్మ(జ్యోతిక)  ఇంట్లో లేకపోవడంతో సందడి లేదు. మేమంతా ఇన్నాళ్లు కలిసి ఉండటానికి కారణం వదినమ్మ జ్యోతికనే. కానీ వారి పిల్లలు ఎదుగుతుండటంతో, చదువుల రీత్యా ముంబైకి షిఫ్ట్ అయ్యారు. చదువులు పూర్తయ్యాక తిరిగి వస్తారు. అప్పటి వరకు పండుగలకు కలుస్తూనే ఉంటాం.‘ అంటూ కార్తీ ఎమోషనల్ అయ్యారు. నెక్ట్స్ కార్తీ ‘జపాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అటు సూర్య ‘కంగువా’తో వస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios