తమన్నా ఫిట్‌నెస్‌ పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ సందర్భంగా శుక్రవారం ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది తమన్నా.

మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. బుధవారం ఆమె తన ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను కలుసుకుంది. పోయిన ఎనర్జీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది. చెప్పడమే కాదు, రంగంలోకి దిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఫిట్‌నెస్‌ పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ సందర్భంగా శుక్రవారం ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది తమన్నా. డే 1 పేరుతో ముంబయిలోని తమ అపార్ట్ మెంట్‌ గ్రౌండ్‌లో కసరత్తులు చేస్తూ తన ఫిట్‌నెస్‌ని చాటుకుంది. జనరల్‌గా తమన్నా ఫిట్‌నెస్‌ని అధిక ప్రాధాన్యమిస్తుంది. కరోనా నుంచి కోలుకున్నాక దానికి మరింత ప్రయారిటీ ఇవ్వడం ప్రారంభించింది. ఇది చాలా ముఖ్యమని తెలిపింది.

ఇందులో కరోనాని జయించిన తర్వాత ఆనందంలో రెచ్చిపోయింది మిల్కీ బ్యూటీ. వార్మప్‌ ఎక్సర్‌సైజ్‌ లతో స్టామినా పెంచుకునేందుకు కేవలం బేబీ స్టెప్సే వేస్తున్నానని పేర్కొంది తమన్నా. ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసిన తమన్నా ప్రస్తుతం `బోల్‌ చుడియన్‌`, `సీటీమార్‌` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు నితిన్‌ హీరోగా రూపొందే బాలీవుడ్‌ చిత్రం `అంధాధున్‌` రీమేక్‌లో నటించబోతుంది. 

View post on Instagram