ప్రస్తుతం బిగ్ బాస్ షోకి విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్, నాగార్జున హోస్టింగ్, ఎలిమినేషన్స్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లోకి టాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాల పాటు సాగిన తమన్నా ప్రయాణం ఆదివారంతో ముగిసింది. బిగ్ బాస్ నుంచి తమన్నా ఎలిమినేట్ అయింది. బయటకు వచ్చాక బిగ్ బాస్ విశేషాలని తమన్నా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. బిగ్ బాస్ షోలో ఉన్నన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశానని తమన్నా తెలిపింది. 

తాను ఎలిమినేట్ కావడానికి కారణం ప్రజలు తనని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే అని తమన్నా తెలిపింది. బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో. లోపలికి ఎవరైనా గేమ్ ఆడేందుకే వెళతారు. రవి కృష్ణ విషయంలో తన ప్రవర్తన గేమ్ లో భాగమే అని తమన్నా తెలిపింది. కానీ అందరూ అది అర్థం చేసుకోకుండా నా క్యారెక్టర్ ని తప్పుబట్టారు. అది సరికాదు. గేమ్ లో అలా ప్రవర్తించినంత మాత్రాన నేను చెడ్డదాన్ని ఐపోతానా అని తమన్నా ప్రశ్నించింది. 

బిగ్ బాస్ హౌస్ లో నేను వెళ్లే సమయానికే కొన్ని గ్రూపులు ఉన్నాయి. వారంతా గ్రూపులుగా మారి నన్ను టార్గెట్ చేశారు అని తమన్నా పేర్కొంది. రవి, అలీ, రోహిణి ఒక గ్రూప్ అని తమన్నా పేర్కొంది. రవి కృష్ణని నేను తిట్టలేదు.. రెచ్చగొట్టాను అంతే. ప్రస్తుతం షోలో ఉన్నవారిలో శ్రీముఖి, బాబా భాస్కర్ అంటే తనకు ఇష్టం అని తమన్నా పేర్కొంది.