'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక ఆ తరువాత నటించిన 'గీత గోవిందం' సినిమాతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో ఆమె నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్న 'దేవదాస్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రష్మిక తన అందంతో అక్కడున్న వారిని మెస్మరైజ్ చేసింది.

చక్కటి కాస్ట్యూమ్స్ తో వచ్చి కెమెరా క్లిక్కులన్నీ తనవైపు ఉండేలా చూసుకుంది. ఈ క్రమంలో కొన్ని కెమెరాలు రష్మిక టాటూని టార్గెట్ చేశాయి. ఇప్పుడు ఆ టాటూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ టాటూ ఏంటంటే..? 'Irreplaceable'.. అంటే భర్తీ చేయలేని స్థానమని అర్ధం.

దీంతో ఈ టాటూ ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి కోసమే వేయించుకుందని.. దీన్ని బట్టి ఆమె రక్షిత్ ని ఎంతగా ప్రేమిస్తుందో తెలుస్తుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. రక్షిత్-రష్మికల బ్రేకప్ లో చాలా మంది రష్మికనే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ జంట ఎందుకు విడిపోయిందనే విషయంపై స్పష్టత ఇవ్వనప్పటికీ అభిమానులు మాత్రం తప్పు రష్మికదే అన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ టాటూ రష్మిక.. రక్షిత్ కలిసి 'కిరిక్ పార్టీ' సినిమా చేసే సమయంలో కూడా ఉంది. మరి అంతకుముందే ఈ టాటూ వేయించుకుందా..? లేక రక్షిత్ తో స్నేహం ఏర్పడిన తరువాత వేయించుకుందా..? అనే విషయంలో క్లారిటీ లేదు.