మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన చిత్రం సైరా. అక్టోబర్ 2న సైరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం రాత్రి నుంచే అన్ని ప్రాంతాల్లో స్పెషల్ షోల హంగంగా ప్రారంభం కాబోతోంది. సైరా చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 1600 స్క్రీన్స్ లో హిందీలో సైరా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. 

సైరా చిత్రాన్ని ప్రత్యేకంగా ముంబైలో మీడియా కోసం ప్రదర్శిస్తున్నారు. ఆ షో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ రాత్రి 11 గంటలలోపు హిందీ ఫిలిం క్రిటిక్స్ నుంచి సైరా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేస్తుందన్నమాట. ఇది మెగా అభిమానులని కాస్త కలవరపెడుతోంది. హిందీ ఫిలిం క్రిటిక్స్ సాధారణంగా సౌత్ చిత్రాలపై అక్కసు వెళ్లగక్కుతుంటారు. 

కొన్ని మైనస్ పాయింట్స్ దొరికినా నెగిటివ్ రివ్యూలు ఇస్తారు. తెలుగు చిత్రాల విషయంలో హిందీ క్రిటిక్స్ వైఖరి చూస్తూనే ఉన్నాం. రాంచరణ్ నటించిన జంజీర్ నుంచి ఇటీవల ప్రభాస్ నటించిన సాహో వరకు అదే పరిస్థితి. ఇదే ప్రస్తుతం మెగా అభిమానులని ఆందోళనకు గురిచేస్తోంది. 

హిందీ క్రిటిక్స్ సైరా చిత్రానికి ఎలాంటి రివ్యూలు ఇస్తారు, టాక్ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ నెలకొని ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటనే సైరా చిత్రం 'వార్' మూవీ నుంచి హిందీలో పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది.