మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం గాంధీ జయంతి సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. సౌత్ ఇండియన్ అన్ని భాషలతో పాటు హిందీలో కూడా సైరా చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రాన్ని తెరకెక్కించారు. 

రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 250 కోట్లకు పైగా బడ్జెట్ లో తెరకెక్కిన సైరా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. యుఎస్ లో సైరా చిత్ర ప్రీమియర్ షోల ప్రదర్శన జరిగింది. తెల్లవారు జామునుంచి తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు ప్రారంభం కానున్నాయి. 

సైరా చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సైరా చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. 

షో ఇప్పుడే పూర్తయింది. చిరంజీవి పెర్ఫామెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్ ఈ చిత్రంలో హైలైట్స్. ఇంకేమి ఆలోచించకుండా ఈ చిత్రాన్ని చూసేయొచ్చు. 

 

 

ప్రీ ఇంటర్వెల్ 30 నిమిషాలు కుమ్మేశారు. ఫస్ట్ 40 మాత్రం సినిమా స్లోగా ఉంది. కానీ ఆ తర్వాత బాస్ మాస్ అంతే.

సైరా చిత్రం చూశాక 19వ శతాబ్దంలో నేనెందుకు పుట్టలేదా అనిపించింది. నాకు కూడా ఆ వీరులతో కలసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి అని అనిపించింది.

సైరా అద్భుతమైన చిత్రం.. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. చిరంజీవి తన పాత్రలో అదరగొట్టారు. చిత్రంలో మిగిలిన పాత్రలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సైరా హిట్టు బొమ్మ.

సైరా ఒక రత్నం లాంటి సినిమా. డ్రామా, దేశభక్తి, ఎమోషన్ ఎలా అన్ని అంశాలని సురేందర్ రెడ్డి అద్భుతంగా మిక్స్ చేశారు. సైరా తర్వాత సురేందర్ రెడ్డి క్రేజ్ మరో స్థాయికి చేరుకుంటుంది.

ఫస్ట్ హాఫ్ ని బిల్డ్ అప్ చేసిన విధానం, ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం బావున్నాయి. సెకండ్ హాఫ్ లో 5 సీరియస్ గా సాగే సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్ సన్నివేశాన్ని చిరు తన నటనతో మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఈ చిత్రంలో ఎమోషన్ అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత కంటతడి పెట్టించిన చిత్రం ఇది.