మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న రిలీజవుతోంది. మెగాస్టార్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలైపోయింది. 

చిరంజీవి నటించిన చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన షోలు ఉండాల్సిందే. అభిమానులు ఫాన్స్ షోలతో హంగామా చేయడం సహజమే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో స్పెషల్ షోలకు డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ షోల టికెట్స్ ధర ఆకాశాన్ని తాకుతునా ఫ్యాన్స్ వెనకడుగు వేయడం లేదు. 

వెస్ట్ గోదావరిలో కొయ్యలగూడెంలో సైరా స్పెషల్ షోలకు టికెట్ ధరని 600గా నిర్ణయించారు. ఇప్పటికే టికెట్స్ మొత్తం అయిపోయాయి. ఇదిలా ఉండగా నంద్యాల, గుడివాడ లాంటి పట్టణాల్లో థియేటర్స్ వద్ద మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్లు దర్శనం ఇస్తున్నాయి. విడుదలకు కొన్ని రోజుల ముందే సైరా సందడి షురూ అయింది.