మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం నేడు(అక్టోబర్ 2) ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ముంబై లాంటి ప్రాంతాల్లో స్పెషల్ షోలు పడ్డాయి. ముంబై క్రిటిక్స్ నుంచి సైరా చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 

ఇదిలా ఉండగా సైరా చిత్రంలోని ఒక్కో విశేషం బయటకు వస్తోంది. సురేందర్ రెడ్డి సైరా చిత్రానికి అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించినట్లు సమాచారం. బ్యాగ్రౌండ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభం అవుతుంది. సురేందర్ రెడ్డి లండన్ లోని బకింగ్ హమ్ ప్యాలెస్ లో ఓపెనింగ్ షాట్ తో సినిమాని ప్రారంభించారు. 

ఈ చిత్రంలో అనుష్క పాత్ర ద్వారా సైరా నరసింహారెడ్డి పాత్ర పరిచయం అవుతుంది. అనుష్క ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మి బాయి గా నటిస్తున్న సంగతి తెలిసిందే.