టాలీవుడ్ లో మరో సినిమా యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద డాలర్ల వర్షం కురిపిస్తోంది. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి యూఎస్ లో భారీ స్థాయిలో విడుదలయ్యింది. ఇక ప్రీమియర్ షోలతో సైరా ఈజీగా అనుకున్న టార్గెట్ ఫినిష్ చేసింది. మెగాస్టార్ గత చిత్రం ఖైదీ నెంబర్ 150 ఈజీగా 1$ మిలియన్ మార్క్ ని అందుకున్న విషయం తెలిసిందే.  

అయితే ఈ సారి ఆ స్థాయిలో డాలర్స్ అందకపోవచ్చనే అనుమానాలు వచ్చాయి. కానీ సినిమాకు చివరి నిమిషంలో వచ్చిన క్రేజ్ ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ రేంజ్ ని పెంచాయి. మంగళవారం సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించగా $8,17,0000 వసూళ్లు అందాయి. కెనడాలో $40,122 కలెక్షన్స్ రాబట్టిన సైరా ప్రీమియర్ కలెక్షన్స్ తో $8,57,000 గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. బుధవారం సాయంత్రం సమయానికి $1,45,000 గ్రాస్ కలెక్షన్స్ అందినట్లు సమాచారం.  

ఈ దెబ్బతో 1 మిలియన్ డాలర్స్ ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇదే ఫ్లోలో కొనసాగితే వీకెండ్ సమయానికి టాప్ తెలుగు ఫిలిమ్స్ లిస్ట్ లో సైరాకి చోటు దక్కినట్లే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ ప్రాజెక్ట్ ని కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మించారు.