'బాహుబలి' సినిమా తరువాత తెలుగు సినిమా స్థాయి ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా స్ఫూర్తితోనే 'సైరా నరసింహారెడ్డి' సినిమాను రూపొందించారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడంతో కలెక్షన్లు కూడా ఓ రేంజ్ లో వస్తాయని భావించారు. ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా రెండు మిలియన్ల డాలర్లు  రాబడుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు మిలియన్ మార్క్ అందుకోవడం కూడా 'సైరా'కి కష్టంగా మారింది.

ప్రస్తుతం 'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్స్ 8 లక్షల డాలర్లకి చేరువగా ఉన్నాయి. దీంతో మిలియన్ డాలర్స్ ని టచ్ చేయడం కష్టమని అంటున్నారు. ఇండియాలో ఈరోజు 
హాలిడేనే కానీ ఓవర్సీస్ లో మాత్రం వర్కింగ్ డే. దాని వలన కూడా సినిమా ప్రీమియర్ షోల కలెక్షన్స్ తగ్గాయని చెబుతున్నారు.

అయితే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరుగుతాయని భావిస్తున్నారు. బాలీవుడ్ లో సైతం మంచి టాక్ రావడంతో వీకెండ్ లో తెలుగు వెర్షన్ తో పాటు హిందీ వెర్షన్ కి కూడా మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. గతంలో ఎన్టీఆర్ 'అరవింద సమేత' సినిమా ప్రీమియర్ షోల ద్వారా798 వేల డాలర్లు వసూలు చేయగా.. 'సాహో' 850 వేల డాలర్లు,  భరత్ అనే నేను 850K డాలర్స్ కలెక్ట్ చేసాయి.

పైగా వీటిలో అరవింద సమేత, భరత్ అనే నేను కేవలం తెలుగు రిలీజ్ మాత్రమే. అయినా కూడా ఆ రేంజ్ వసూళ్లు రాబట్టాయి. సైరాకి ఉన్న బజ్‌కి ఇంత తక్కువ వసూళ్లు వచ్చాయంటే సినిమాకి ఉన్న లో బజ్ కారణమని చెప్పాలి. వీకెండ్ మాత్రం సినిమా పుంజుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు.