కొత్తబంగారు లోకం సినిమాతో అప్పట్లో అభిమానులను ఒక్కసారిగా ఆకర్షించిన బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్. అయితే నేషనల్ అవార్డ్ గెలిచిన అమ్మడికి ఆ సినిమా తప్పితే మరో సినిమా సక్సెస్ ఇవ్వలేదు.
కొత్తబంగారు లోకం సినిమాతో అప్పట్లో అభిమానులను ఒక్కసారిగా ఆకర్షించిన బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్. అయితే నేషనల్ అవార్డ్ గెలిచిన అమ్మడికి ఆ సినిమా తప్పితే మరో సినిమా సక్సెస్ ఇవ్వలేదు. గత ఏడాది వరకు వచ్చిన అవకాశాలతో కష్టపడినప్పటికీ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది.
ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా వెబ్ మీడియాలో అమ్మడి వివాహం గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. బాయ్ ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ తో గత ఏడాది పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో వేడుకలు కూడా బాగానే జరిగాయి. అయితే ఇప్పుడు పెళ్లి డేట్ సెట్టయినట్లు సమాచారం.
పూణేలోని ఒక ప్రధాన ప్యాలెస్ లో వివాహ వేడుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అలాగే అదే నెలలో ముంబై లోని ఒక హోటల్ రిసెప్షన్ కి వేదిక కానుందని సమాచారం. గత నాలుగేళ్లుగా శ్వేత బసు రోహిత్ శెట్టి ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ గ పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలని శ్వేత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
