హాట్ గా చేయ‌గ‌ల‌నంటున్న స్వాతి అవ‌కాశాల కోసం వ‌ర్కౌట్స్‌ చాన్స్ ఇస్తే అన్నిటికి సిద్ధం

అష్టా చెమ్మా, స్వామి రారా సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన కలర్స్ బ్యూటీ స్వాతికి తెలుగులో మంచి ఆఫర్స్ రావాల్సి ఉన్నా... తనకి మాత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి సరైన ఆఫర్స్ రావటం లేదు. టాలీవుడ్ లో రోజురోజుకి కొత్త హీరోయిన్స్ వస్తుండటంతో ఈ బ్యూటీకి కాంపిటీషన్ పెరుగుతూ వస్తుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దీని కారణంగా కలర్స్ స్వాతికి ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గుతున్నాయని అంటున్నారు. అంతే కాకుండా కలర్స్ స్వాతి కాస్త బొద్దుగా ఉండటంతో ఈ బ్యూటిని సన్నబడాలని ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులు, హీరోలు చెబుతున్నారంట. దీంతో కలర్స్ స్వాతి బరువు తగ్గటానికి రెడీ అయ్యారు. 

తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ యంగ్‌ హీరో మూవీలో నటించటానికి కలర్స్ స్వాతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ సాగే ఈ సినిమా కథ తనకి బాగా నచ్చడంతో స్వాతి వెంటనే ఓకే చెప్పేసిందట. ఇదిలా ఉంటే తను తగ్గిన బరువుతో ఓ హాట్ ఫోటో షూట్‌ కి సైతం రెడీ అయినట్టుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.