Asianet News TeluguAsianet News Telugu

నువ్వు వర్జినా..? అని అడిగేసిన హీరోయిన్ ..షాక్ లో బెల్లంకొండవారి కొత్త హీరో

హీరోగా బెల్లంకొండ వారి రెండో వారసుడు గణేష్ స్క్రీన్ మీదకు వచ్చేశాడు. బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ నటించిన స్వాతిముత్యం  సినిమా నుంచి సంక్రాంతి అప్ డేట్ ఇచ్చేశారు.

Swathi Muthyam New Movie First Glimps
Author
Hyderabad, First Published Jan 15, 2022, 7:00 PM IST

హీరోగా బెల్లంకొండ వారి రెండో వారసుడు గణేష్ స్క్రీన్ మీదకు వచ్చేశాడు. బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ నటించిన స్వాతిముత్యం  సినిమా నుంచి సంక్రాంతి అప్ డేట్ ఇచ్చేశారు.

బెల్లంకొండ యంగ్ హీరో సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే అన్న సాయి శ్రీనివాస్ ఎలాగోలా ఇండస్ట్రీలో సెట్ అయ్యాడు. చాలా కష్టపడి వరుసగా సినిమాలు చేసి.. అన్ని జానర్లు ట్రై చేసి.. టాలీవుడ్ హీరో అనిపించుకున్నాడు సాయి శ్రీనివాస్. ఇక బాలీవుడ్ ను కూడా ఓ చూపు చూపు చూడటానికి అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఇక తమ్ముడిని హీరోని చేయడానికి గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అక్కడ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న ఛత్రపతి రీమేక్ హిట్ అయితే.. ఆయన బాలీవుడ్ లో సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ తమ్ముడు గణేష్ టాలీవుడ్ ను చూసుకోవాలి అని ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఇక బెల్లంకొండ గణేష్ హీరోగా.. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా స్వాతిముత్యం. ఈమూవీలో కి సంబంధిచిన ఫస్ట్ గ్లింప్స్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు టీమ్. ఈ సినిమాలో అమాయకపు చక్రవర్తిలా గణేష్ నటించారు.

 

లక్ష్మణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ కరోనా కారణంగా డిలే అవుతూ వస్తోంది.  ఫస్ట్ గ్లింప్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. సరదాగా సాగిపోతున్న ఈ వీడియోలో అమాయకుడైన హీరోను పట్టుకుని.. నువ్వ వర్జిన్ ఆ.. అని హీరోయిన్ అడగడం..ప్రత్యేకంగా ఆడియన్స్ ఆకర్షిస్తుంది. అంతే కాదు హీరో.. హీరోయిన్ల మధ్య లవ్ సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నట్టు తెలుస్తోంది. సినిమాలో కామెడీ పాళ్లు కూడా గట్టిగానే ఉన్నట్టు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. రిలీజ్ కు ముస్తాబు అవుతున్న ఈమూవీలో బెల్లంకొండ గణేష్ తో పాటు.. వర్షబొల్లమ్మ, రావురమేష్,  నరేష్, శ్రీవాణి, ప్రగతి ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios