యంగ్ హీరోయిన్ స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్ లోకి మూడవ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ కి ఐపీఎల్ షాక్ తగలడంతో పాటు, కంటెస్టెంట్స్ విషయంలో సంతృప్తిగా లేకపోవడంతో బిగ్ బాస్ షో ఊహించిన ఆదరణ దక్కించుకోలేక పోతుంది. ప్రారంభ ఎపిసోడ్ లో రికార్డు టీఆర్పీ దక్కించుకున్న బిగ్ బాస్ షో ఆ తరువాత నెమ్మదించింది అనేది వాస్తవం. కొన్ని పాప్యులర్ టీవీ సీరియల్స్ కంటే కూడా బిగ్ బాస్ తక్కువ రేటింగ్ దక్కించుకుంటుందట. 

ఈ నేపథ్యంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో జోష్ నింపాలని నిర్వాహకులు భావించారు. దీని కోసం యంగ్ హీరోయిన్ స్వాతి దీక్షిత్ ని హౌస్ లోకి ప్రవేశపెట్టారు. స్వాతి దీక్షిత్ రాక హౌస్ కి గ్లామర్ జోడిస్తుంది బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వాహకులు భావిస్తున్నారు. బిగ్ బాస్ లో మోనాల్ హీరోయిన్ హోదాలో పాల్గొంటున్నారు. ఈ హీరోయిన్ బిగ్ బాస్ ప్రేక్షకులను తన అందాలు, ఎనర్జీతో అలరిస్తుందని నిర్వాహకులు భావించారు. కానీ మోనాల్ ఆ విషయంలో బిగ్ బాస్ ప్రేక్షకులను సంతృప్తి పరచయలేక పోతుంది. 

ఐతే అఖిల్ మరియు అభిజిత్ లతో ఆమె నడుపుతున్న రొమాన్స్ మాత్రం ఒకింత ఆసక్తిరేపుతుంది. స్వాతి దీక్షిత్ రాకతో ఈ విషయంలో మోనాల్ పై ఒత్తిడి పెరగనుంది. మోనాల్ కి స్వాతి దీక్షిత్ ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. హౌస్ లో స్వాతి మెరుగైన అట కనబరిస్తే మోనాల్ స్థానం కదిలినట్లే. స్వాతి చక్కగా తెలుగు మాట్లాడం కూడా ఆమెకు మరింత అడ్వాంటేజ్. కావున మోనాల్ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా హౌస్ నుండి ఎలిమినేట్ కావడం ఖాయం. ఇదే విషయం మోనాల్ ని కూడా  భయపెడుతుంది.