బోల్డ్ బ్యూటీ స్వరభాస్కర్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ చిత్రాలతో స్వర భాస్కర్ పాపులర్ అయింది. బోల్డ్ రోల్స్ లో నటిస్తూ అందరిని ఆకర్షించింది.

బోల్డ్ బ్యూటీ స్వరభాస్కర్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ చిత్రాలతో స్వర భాస్కర్ పాపులర్ అయింది. బోల్డ్ రోల్స్ లో నటిస్తూ అందరిని ఆకర్షించింది. అలాగే స్వర భాస్కర్ సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ పై కూడా తరచుగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. 

ఇది పక్కన పెడితే తాజాగా స్వర భాస్కర్ కి చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం స్వర భాస్కర్ లాస్ ఏంజిల్స్ వెళ్ళింది. అక్కడ ఉబెర్ క్యాబ్ లో ప్రయాణిస్తుండగా ఆమె లగేజ్ మొత్తం పోయిందట. అందులో చాలా వస్తువులు ఉన్నాయి. తాను ముందుగా యాడ్ చేసుకున్న ఓ స్టాప్ వద్ద ఆగినప్పుడు ఉబెర్ క్యాబ్ డ్రైవర్ తనకి తెలియకుండా లగేజ్ తో వెళ్ళిపోయాడు. దీనితో స్వర భాస్కర్ ఊహించని షాక్ ఎదుర్కొంది. 

వెంటనే ఉబెర్ సంస్థకి ట్యాగ్ చేస్తూ జరిగిన విషయాన్ని చెప్పింది. మీ క్యాబ్ డ్రైవర్ నా లగేజ్ తీసుకుని వెళ్ళిపోయాడు. నేను మరచిపోలేదు. కానీ అతడు క్యాబ్ తో సహా వెళ్ళిపోయాడు. నా లగేజ్, వస్తువులు నేను తిరిగి పొందవచ్చా ? అంటూ ఉబెర్ సంస్థని ప్రశ్నించింది స్వర భాస్కర్. 

దీనితో ఉబెర్ సంస్థ స్పందించింది. జరిగిన తప్పుని సరిచేయడానికి ప్రయత్నిస్తామని పేర్కొంది. స్వర భాస్కర్ 2018లో నటించిన వీరే దే వెడ్డింగ్ చిత్రంతో బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పలు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. 

Scroll to load tweet…