సినిమాలో రిలీఫ్ కోసం ప్రేక్షకులు కామెడీ సీన్స్ కోరుకోవటం సహజం. అయితే కామెడీ సీన్స్ వల్ల తమ సినిమాకు డెప్త్ తగ్గిపోతుందని భావించే దర్శకులు ఉన్నారు. అలాంటివాళ్ళు కామెడీ సీన్స్ సినిమాలో పెట్టడానికి ఇష్టపడరు. అయితే ఆ విషయం సినిమా చూసేదాకా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత రివ్యూల్లో రిలీఫ్ లేదు..కామెడీ లేదు అని రాస్తూంటారు. అవన్ని  ఊహించినట్లుున్నాడు.. త్వరలో రిలీజ్ కాబోతున్న ‘సువర్ణసుందరి’ దర్శకుడు. అందుకే ప్రెస్ మీట్ లోనే నా సినిమాలో కామెడీ లేదు..ఎక్సపెక్ట్ చేయద్దు అని చెప్పేసారు. 

సీనియర్ నటి జయప్రద, హీరోయిన్ పూర్ణ, సాక్షి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. నూతన దర్శకుడు ఎం.ఎస్‌.ఎన్‌ సూర్య దర్శకత్వం వహించిన .... ఈ చిత్రం ఈ నెల  31న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ డేట్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది టీమ్. ఈ సందర్బంగా దర్శకుడు, నిర్మాత మీడియాతో  మాట్లాడారు.

డైరెక్ట‌ర్ ఎం.ఎస్.ఎన్‌. సూర్య మాట్లాడుతూ... ఒక డైరెక్ట‌ర్‌గా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆల్రెడీ రిలీజ్ చేసిన మా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  ఈ మూవీలో కామెడీ లేదు ఎవ్వ‌రూ కామెడీని ఎక్స్‌పెక్ట్ చెయ్యోద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆరువంద‌ల సంవ‌త్స‌రాల క్రితం ఒక‌రాజు చేసిన త‌ప్పిదం వ‌ల్ల త‌ర‌త‌రాల వాళ్ళ‌ను వెంటాడే క‌థ ఇది. ఇందులో జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి అంద‌రి పార‌త‌లు కీల‌క‌మైన‌వే  అని అన్నారు.

ప్రొడ్యూస‌ర్ ల‌క్ష్మీ మాట్లాడుతూ... మా సినిమాకి మొద‌టి నుంచి కూడా మీడియా చాలా స‌పోర్ట్ చేసింది. మీ స‌పోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నాను. ఈ నెల 31వ తేదీన తెలుగు, క‌న్న‌డ‌లో విడుద‌ల‌వుతుంది. గ‌తంలో విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  ఈరోజు విడుద‌లైన మ‌రో ట్రైల‌ర్‌ని కూడా అదే విధంగా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మేము అనుకున్న బ‌డ్జెట్ కంటే ఎక్కువ‌గానే ఖర్చు అయింది. అయినా అవుట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది.