సుస్మితా సేన్ ఈ మధ్యలో బాలీవుడ్ లో  ఎక్కువగా వినిపించిన పేరు. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చి..  ముచ్చటగా మూడో సారి లలిత్ మోడీతో ప్రేమలో పడింది సీనియర్ బ్యూటీ. ఇక రీసెంట్ గా మళ్లీ తన మాజీ ప్రియుడితో డేటింగ్ చేస్తోంది...? 

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్‌ ఈమధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్‌ క్రియేటర్ లలిత్ మోడీతో ప్రేమలో పడ్డ ఈ బ్యూటీ.. రకరాల వార్తలతో ఎప్పుడూ న్యూస్ ఐటమ్ గా మారుతూనే ఉంది. ఏదోక వార్తతో నెట్టింట సందడి చేస్తోంది. లాస్ట్ డిసెంబర్ లో తనకంటే చిన్నవాడైన తన రెండో ప్రియుడుడితో బ్రేకప్ చెప్పిన సుస్మితా సేన్ .. లలిత్ మోడీతో జతకట్టింది. తామిద్దరం ప్రేమలో ఉన్నామని, త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు లలిత్‌ మోదీ రీసెంట్ గా ప్రకటించారు. 

ఈ ఇద్దరు తారల డేటింగ్‌పై సోషల్‌ మీడియా భారీగా డిస్కర్షన్లు జరుగుతున్నాయి. ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయ్యింది. అంతే కాదు నెటిజన్ల నుంచి వీరు ట్రోల్స్‌ కూడా ఎదుర్కొన్నారు. అయితే తాజా న్యూస్ ఏంటీ అంటే సుస్మితా సేన్ డబుల్ గేమ్ ఆడుతుందా అని నెటిజన్లు అనుమానం వ్యాక్తం చేస్తున్నారు. లలిత్ మోడీతో ప్రేమలో ఉన్న ఆమె.. రీసెంట్ గా తన మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కింది. దాంతో ఈ న్యూస్ నెట్టింట్ట తెగ వైరల్ అవుతోంది. 

View post on Instagram

 ఆమిర్‌ ఖాన్‌, నాగ చైతన్య నటించిన లాల్‌ సింగ్‌ చద్దా మూవీ రిలీజ్‌ సందర్భంగా ఒక రోజు ముందు ప్రీమియర్ ను నిర్వహించారు. ఈ ప్రిమియర్ షోకు షోకు సుష్మితా సేన్ తన పెంపుడు పిల్లలతో పాటు కలిసి వచ్చింది. అయితే వారితో పాటు ఆమె మాజీ ప్రియుడు రోహ్మాన్‌ షాల్‌ కూడా ఉన్నాడు. ప్రస్తుం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో రోహ్మాన్‌ వారితో చాలా సరదాగా కనిపించాడు. కాగా రోహ్మాన్‌తో బ్రేక్‌ప్‌ అయిపోయి.. లలిత్‌ మోదీతో డేటింగ్‌ చేస్తున్న సుష్మితా సేన్ మళ్లీ మాజీ ప్రియుడితో కలిసి తిరుగుతుండటం.. హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరు సినిమాకు వెళ్లే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

గతంలో మాజీ క్రికెటర్ తో ప్రేమలో మునిగి తేలిన సుస్మితా సేన్.. ఆతరువాత తనకంటే చిన్నవాడైన రోహ్మాన్‌ కొన్నేళ్ల డేటింగ్‌ చేసింది. ఆతరువాత గత డిసెంబర్‌లో బ్రేకప్‌ చెప్పుకున్నారు ఈ జంట. బ్రేకప్ తరువాత కూడా వీరు తరచు కలుస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఆగస్ట్‌ 8న జరిగిన సుష్మితా తల్లి బర్త్‌డే వేడుకులో కూడా రోహ్మాన్‌ సందడి చేశారు. ఫ్యామిలీతో కలిసిపోయి మాట్లాడాడు. ఈ వీడియోను లైవ్ లో సుస్మితా సేనే చూపించింది. అయితే అందరు కెమెరా సైడ్‌ చూడండి అని సుష్మితా అనగానే రోహ్మాన్‌ ఫ్రేం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇది చూసి నెటిజన్లంత షాక్ అయ్యారు. అంతే కాదు మీ ప్రస్తుత బాయ్‌ ఫ్రెండ్‌ లలిత్‌ మోదీ ఎక్కడ అంటూ సుస్మితాను ట్రోల్‌ చేశారు. కూడా. ఇక ఈ విషయంలో లలిత్ మోడీ ఏం స్పందిస్తారో చూడాలి. మరికొంత మంది మాత్రం రోహ్మాన్ తో సుస్మితా మళ్ళీ కలిసింది.. లలిత్ మోడీకి బ్రేకప్ చెప్పిందంటూ గట్టిగా రూమర్స స్ప్రెడ్ చేస్తున్నారు.