Surya- Karthi Multi Starrer Movie : స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సూర్య-కార్తి.. ఫ్యాన్స్ కు పండగే..

అరుదైన మల్టీ స్టారర్ మూవీని త్వరలో తెరపై చూడబోతున్నాం. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేయడం ఒక ఎత్తు అయితే.. అన్నదమ్ములుగా ఉన్న స్టార్ హీరోలు కలిసి సినిమా చేయడం మరో ఎత్తు. అటువంటి సినిమానే త్వరలో తెరకెక్కబోతోంది.

 

Surya , Karthi  Doing multi starrer movie

అరుదైన మల్టీ స్టారర్ మూవీని త్వరలో తెరపై చూడబోతున్నాం. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేయడం ఒక ఎత్తు అయితే.. అన్నదమ్ములుగా ఉన్న స్టార్ హీరోలు కలిసి సినిమా చేయడం మరో ఎత్తు. అటువంటి సినిమానే త్వరలో తెరకెక్కబోతోంది.

 

రొటీన్ కు భిన్నంగా సినిమా చేసే హీరోలలో కోలీవుడ్ స్టార్స్ సూర్య,కార్తి(Surya- Karthi ) కూడా ఉన్నారు. కథల విషయంలో..సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు ఇద్దరు అన్నాతదమ్ములు.  సాధ్యమైనంత వరకూ రొటీన్ కు భిన్నంగా ఉండే కథలనే ఎంచుకుంటారిద్దరూ.. సూర్య జై భీమ్ లాంటి హిట్ సినిమాలతో దూసుకుపోతుంటే.. కార్తి కొంచెం వెనకబడి ఉన్నాడు. సక్సెస్ వచ్చినా రాకున్నా.. తమ మార్కు కథల నుంచి మాత్రం బయటకు రారు హీరోలు.

 

వారసత్వంగా సినిమాల్లోకి వచ్చినా.. సూర్య,కార్తి (Surya- Karthi)  ఇద్దరూ తమకు సొంతగానే ఇమేజ్ ను, స్టార్ డమ్ ను బిల్డ్ చేసకున్నారు. ఓన్ గా ఫ్యాన్స్ బేస్ లను సంపాదించుకున్న ఈ ఇద్దరు హీరోలు.. కోలీవుడ్ లో స్టార్ హీరోలతో పొటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. వివాదాలు చుట్టు ముట్టినా వేనకడుకు వేయకుండా.. తెలుగు తమిళ భాషల్లో దూసుకుపోతున్నారు సూర్య – కార్తి.

 

ఇక ఈ ఇద్దరు స్టార్ బ్రదర్స్ గురించి కోలీవుడ్ లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఇప్పటి వరకూ విడివిడిగా సినిమాలు చేసుకుంటూ.. ఫ్యాన్స్ ను అలరిస్తున్న అన్నదమ్ములు కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయాలి అనేది అభిమానుల కోరిక. ఇన్ని ఏళ్ళ నుంచి సినిమాలు చేస్తున్నా.. ఏదో అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ కాకుండా.. కలిసి ఇద్దరు ఫుల్ లెన్త్ సినిమా చేసింది లేదు. అయితే రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం.. అభిమానుల ను అలరించడానికి.. ఈ ఇద్దరు కలిసి సినిమా  చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.ఇద్దరు కలిసి ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ ఇవ్వబోతున్నారట.  

మలయాళంలో హిట్ అయిన  అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను ఇద్దరు కలిసి తమిళంలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం లేదు అని మరో వర్గం నుంచి సమాచారం అందుతోంది. అయితే ఆడియన్స్ కోసం.. తమ ఫ్యాన్స్ కోసం సూర్య,కార్తి ఇద్దరు కలిసి సినిమా చేయాలి అని చాలా కాలంగా అనుకుంటున్నారు. మంచి కథ కోసం చూస్తున్నారు. వీరి టేస్ట్ కు.. వీరిద్దరి అభిమానుల అభిరుచికి తగ్గట్టు కథ దొరికితే.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు.  అయితే ఇప్పుడు చేయబోయే సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేనేనా.. లేక ఇంకేదైనా స్టోరీనా అనేదానిపై  క్లారిటీ రావాల్సి ఉంది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీని తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కలిసి భీమ్లా నాయక్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. పవర్ స్టార్, రానా క్రేజ్ తో భీమ్లా నాయక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికే రిలీజ్ కావల్సి మూవీ ట్రిపుల్ ఆర్  వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. వచ్చేనెలలో రిలీజ్ కాబోతోంది. ఇక ఈమూవీని తమిళంలో సూర్య- కార్తి రీమేక్ చేస్తే క్రేజ్ మామూలుగా ఉండదు.

Also Read : Rakul Preet Singh: అసత్యాలు ప్రచారం చేయకండి.. పెళ్ళి రూమర్స్ పై మండిపడుతున్న రకుల్ ప్రీత్ సింగ్

 




 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios