Asianet News TeluguAsianet News Telugu

సూర్య సీ3కి జల్లికట్టు దెబ్బ.. విడుదల మళ్లీ వాయిదా

  • తమిళ సినీ రంగంపై జల్లికట్టు ఎఫెక్ట్
  • సూర్య నటించిన సింగం3 సీ3 రిలీజ్ వాయిదా
  • తెలుగులోనూ పోస్ట్ పోన్ అయిన సూర్య సినిమా
suriya singam 3 postponed again

తమిళనాడులో జల్లికట్టు ఆందోలనలు ఏ రేంజ్ లో ఉన్నాయో చూస్తున్నాం. దీంతో సినిమాలపైనా ప్రభావం విపరీతంగా పడింది. తమిళంలో టాప్ స్టార్ సూర్య నటించిన సింగం 3పై జల్లికట్టు ప్రభావం పడింది. దీంతో రిలీజ్ డేట్ వాయిదా వేయక తప్పలేదు. అలా డీ మానిటైజేషన్ దెబ్బకు అప్పుడు వాయిదా పడ్డ సింగం మరోసారి జల్లికట్టు దెబ్బకు ఇప్పుడు వాయిదా పడింది. మధ్యలో ధృవ రిలీజ్ సందర్భంగా సూర్య స్వయంగా తన సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఇలా సింగం3 వాయిదాల మీద వాయిదాలతో ప్రేక్షకుల ఎదురు చూపులు ఎక్కువయ్యాయి. తదుపరి ఎప్పుడు రిలీజ్ చేసేది ఇంకా నిర్ణయించలేదు.

 

వినూత్న‌మైన క‌థ,పాత్ర‌లతో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి స్టార్‌ క్రేజ్‌ను సంపాందించుకున్న సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటించిన చిత్రం "సింగం3". తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో వస్తున్న ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. గ‌తంలోయ‌ముడు, సింగం చిత్రాలు ఘ‌న‌విజ‌యాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌డు ఆదే సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అదినేత‌ మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హేరిస్ జైరాజ్ అందించిన ఆడియో ఇప్ప‌టికే విడుద‌ల‌య్యి సూప‌ర్‌హిట్ ఆడియోగా ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు పోందుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ మూవీని జ‌న‌వ‌రి 26 న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాలని భావించినా వాయిదా వేక తప్పలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios