హీరో సూర్య నటించిన 'జై భీమ్' చిత్రం ప్రేక్షకులని, విమర్శకులని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం IMDB లో రికార్డ్ స్థాయిలో 9.3 రేటింగ్ సాధించి అందరిని ఆశ్చర్య పరిచింది.
ఆస్కార్ అవార్డులు ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలకే దక్కుతుంటాయి. వారి ప్రొడక్షన్ వాల్యూస్, కంటెంట్, టేకింగ్, నటీనటుల పెర్ఫామెన్స్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి. ఇండియన్ సినిమాలు ఆస్కార్ సాధించడం కాదు.. కనీసం బరిలో కూడా నిలవలేవనే విమర్శ ఉంది. కానీ ప్రస్తుతం ఇండియన్ సినిమాలు హాలీవుడ్ చిత్రాలకు కంటెంట్ పరంగా, మేకింగ్ పరంగా గట్టి పోటీ ఇస్తున్నాయి.
ఇదిలా ఉండగా హీరో సూర్య నటించిన 'జై భీమ్' చిత్రం ప్రేక్షకులని, విమర్శకులని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం IMDB లో రికార్డ్ స్థాయిలో 9.3 రేటింగ్ సాధించి అందరిని ఆశ్చర్య పరిచింది. గిరిజనుల హక్కుల కోసం పోరాడే అడ్వాకెట్ చంద్రు పాత్రలో సూర్య బ్రిలియంట్ పెర్ఫామెన్స్ అందించాడు. టీజె జ్ఞానవేల్ సహజత్వానికి దగ్గరగా అద్భుతంగా దరకత్వం చేశారు. ఫలితంగా ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది.
మంగళవారం సాయంత్రం అకాడమీ అవార్డుల నామినేషన్స్ ప్రకటించనున్నారు. విజేతలని ప్రకటించే అకాడమీ అవార్డుల కార్యక్రమం మార్చి 27న జరగనుంది. సో ముందుగా నేడు ప్రకటించే నామినేషన్స్ లో జై భీమ్ చిత్రం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
ఈ మేరకు ఓ ట్వీట్ లీకై అందరిని ఉత్కంఠకు గురిచేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ రొట్టెన్ టమాటోస్ ఎడిటర్ జాక్వెలిన్, న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ కాయిలే బుచానన్ మధ్య ట్విట్టర్ లో జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది.
కాయిలే బుచానన్ ట్వీట్ చేస్తూ 'మిమల్ని ఆశ్చర్యపరిచబోయే ఆస్కార్ నామినేషన్ ఏది ? అని కామెంట్ పెట్టారు. దీనికి రొట్టెన్ టొమాటోస్ ఎడిటర్ జాక్వెలిన్ రిప్లై ఇస్తూ.. 'ఉత్తమ చిత్రం విభాగంలో జై భీమ్.. ఈ విషయంలో నన్ను నమ్మండి' అని కామెంట్ పెట్టారు. దీనితో జై భీమ్ ఆస్కార్ విన్నింగ్ రేసులో ఉందంటూ అంచనాలు పెరిగిపోయాయి.
దీనితో జాక్వెలిన్ మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 'హాయ్ జై భీమ్ ఫ్యాన్స్.. ఈ మూవీ నాకు చాలా నచ్చింది. ఈ చిత్రం నామినేట్ అయ్యిందా లేదా అనేది నాకు ఐడియా లేదు. ఒకవేళ నామినేషన్స్ లో ఉంటే చాలా సంతోషం.. గుడ్ లక్' అని పేర్కొంది. జై భీమ్ ఆస్కార్ సాధించినా సాధించకపోయినా అంతర్జాతీయ విమర్శకుల హృదయాలు కూడా గెలుచుకుంది.
