టాలీవుడ్ లో గత కొంత కాలంగా విక్రమ్ వేధా రీమేక్ గురించి అనేక రకాల వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ్ లో మాధవన్ - విజయ్ సేతుపతి నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లను వసూలు చేసింది. 

టాలీవుడ్ లో గత కొంత కాలంగా విక్రమ్ వేధా రీమేక్ గురించి అనేక రకాల వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ్ లో మాధవన్ - విజయ్ సేతుపతి నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లను వసూలు చేసింది. అయితే తెలుగులో ఆ కథను త్వరలోనే రీమేక్ చేయబోతున్నారని టాక్ వచ్చింది. 

ఇక మెయిన్ హీరోగా వెంకటేష్ - నారా రోహిత్ మరో కథానాయకుడి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కథనాలు వచ్చాయి. అదే విధంగా దర్శకుడిగా వినాయక్ సెలెక్ట్ అయినట్లు రూమర్స్ రావడంతో ఈ విషయంపై సురేష్ ప్రొడక్షన్స్ క్లారిటీ ఇచ్చింది. 

వెంకటేష్ విక్రమ్ వేధా సినిమాలో నటిస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రస్తుతం ఆయన వెంకీ మామ సినిమాతో చాలా బిజీగా ఉన్నట్లు వివరణ ఇచ్చారు. అదే విధంగా వెంకటేష్ నెక్స్ట్ సినిమాకు సంబదించిన అప్డేట్ త్వరలోనే తెలుస్తుందని అన్నారు.