టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గతంలో లాగా మళ్ళీ బిజీ అయ్యారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వరుస చిత్రాలు విడుదలవుతున్నాయి. జూన్ 6న రామానాయుడి జయంతి సందర్భంగా సురేష్ బాబు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.  తాను, వెంకటేష్, తమ పిల్లలు మా తండ్రి రామానాయుడుగారి నుంచి ఎంతో నేర్చుకున్నామని అన్నారు. విజయం దక్కినప్పుడు అందరిని కలుపుపోవాలి. పరాజయం ఎదురైతే ధైర్యంగా మళ్ళీ పని ప్రారంభించాలి. మా నాన్న నుంచి తాము నేర్చుకున్నది ఇదే అని సురేష్ బాబు అన్నారు. 

తమ కుటుంబంలో వెంకటేష్ స్టార్ హీరో అయ్యాడు. రానా కూడా మంచి నటుడిగా రాణిస్తున్నాడు. తాను సినిమా నిర్మాణాలతో బిజీగా ఉన్నా అని తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్.. 'ఎస్ పి'లో 'ఎస్' అంటే స్టార్ వెంకటేష్, 'పి' అంటే ప్రొడ్యూసర్ సురేష్ బాబు అని అన్నారు. చిన్నప్పటి నుంచి నాన్నగారి పక్కనే ఉంటూ సినిమా కలెక్షన్లు, హిట్స్, ప్లాప్ ఇలా సినిమా భాష వింటూ నిర్మాణంపై ఆసక్తి పెరిగిందని సురేష్ బాబు అన్నారు. 

ఇక తన రెండో కుమారుడు అభిరామ్ సినిమాల్లోకి వచ్చే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అభిరామ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. కానీ నేను మాత్రం వాడితో సినిమా చేయను. ముందుగా వాడు అన్నీ నేర్చుకుని నటుడిగా సిద్ధపడాలి. అప్పుడు అభిరామ్ తో సినిమా చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే తండ్రిగా నా సహకారం అందిస్తా అని సురేష్ బాబు తెలిపారు.