తే సురేంద్రరెడ్డి కేవలం కథ మాత్రమే ఇస్తున్నారని, డైరక్షన్ చేయటం లేదని మరో ప్రక్క వినిపిస్తోంది. అలాగే వైష్ణవ్ తేజ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. 


గుర్తుందో లేదో ఆ మద్యన పవన్ పుట్టినరోజు సందర్భంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న పవన్ 29వ చిత్రానికి సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్‌ను వదిలారు.. యథా కాలమ్.. తథా వ్యవహారమ్ అంటూ ప్రకటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారని ఆ ప్రకటన సారాంశం. అయితే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. పవన్ వరస సినిమాల బిజిలో ఆ ప్రాజెక్టుకు అవకాసం లేకుండా పోయింది. ఏజెంట్ తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుందని అందరూ భావించారు. అలాగే సురేంద్రరెడ్డి సైతం వెళ్లి పవన్ ని కలిసి ఈ ప్రాజెక్టు గురించి చర్చించారని సమాచారం. అయితే తను అంత భారీ సినిమాలకు ఎక్కువ రోజులు డేట్స్ ఇచ్చే పరిస్దితుల్లో లేనని పవన్ చెప్పేసారట. 

ముప్పై రోజుల్లో సినిమా పూర్తి చేయగలిగితే ముందుకు వెళ్లవచ్చని, కానీ సురేంద్రరెడ్డి సినిమా అంటే అంతకు మించి అన్నట్లు ఉంటుంది కాబట్టి కష్టమని చెప్పారు. తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఈ లోగా చేయమని..తర్వాత చూద్దామని అనటంతో అటు దిసగా సురేంద్రరెడ్డి ప్రయాణం పెట్టుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అయితే సురేంద్రరెడ్డి కేవలం కథ మాత్రమే ఇస్తున్నారని, డైరక్షన్ చేయటం లేదని మరో ప్రక్క వినిపిస్తోంది. అలాగే వైష్ణవ్ తేజ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఈ రెండు పూర్తి చేశాక సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందా లేక మధ్యలో గ్యాప్ తీసుకుని ఈ మూవీ చేస్తాడా అనేది త్వరలో క్లారిటీ రానుంది.

 ఇక సాధారణంగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తూ వస్తున్నారు. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో గతంలో కిక్, రేసుగుర్రం వంటి హిట్ సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఏజెంట్ వర్కవుట్ కాకపోవటంతో ప్రాజెక్టులు అన్నీ తారుమారు అవుతున్నాయి. ఇప్పుడు సురేంద్రరెడ్డి పై అంత బడ్జెట్ అంటే ఓ నిముషం ఆలోచిస్తారు. అయితే ఆయన గతంలో ఇచ్చిన హిట్స్, స్టైలిష్ డైరక్టర్ అనే పేరు , ఇండస్ట్రీ పరిచయాలు మళ్లీ పెద్ద ప్రాజెక్టునే సెట్ చేస్తాయనటంలో సందేహం లేదు.