కరోనా కారణంగా జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. సడన్‌గా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డారు. విదేశాల్లో ఇరుక్కుపోయిన సెలబ్రిటీ కుటుంబ సభ్యులను తిరిగి ఇంటికి చేరే అవకాశం లేకపోవటంతో వారంత కుటుంబాలను చాలా మిస్‌ అవుతున్నారు. ఇటీవల మంచు విష్ణు భార్య పిల్లలు కూడా వంద రోజుల తరువాత ఇంటికి చేరిన సంగతి తెలిసిందే.

ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు బాలీవుడ్ సూపర్‌ స్టార్ సంజయ్ దత్‌. ప్రస్తుతం  సీనియర్ హీరో ముంబైలో ఉంటుండగా ఆయన భార్య పిల్లలు మాత్రం దుబాయ్‌లో చిక్కుకుపోయారు. లాక్‌ డౌన్‌కు ముందు సంజయ్ దత్‌ భార్య మాన్యతతో పాటు ఇద్దరు పిల్లలు దుబాయ్‌ వెళ్లిపోయారు. ఈ లోగా ప్రపంచ దేశాలన్ని లాక్‌ డౌన్ ప్రకటించటంతో అక్కడే చిక్కుకుపోయారు, ఇప్పటికీ భారత్‌కు అంతర్జాతీయ విమానాలు అనుమతించకపోవటంతో వారు తిరిగి వచ్చే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో తాను తన భార్యా పిల్లలను చాలా మిస్‌ అవుతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సంజయ్ దత్‌. తన భార్యా పిల్లలతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంజూ బాబా.. ` నేను వాళ్లను చాలా మిస్‌ అవుతున్నాను. ఎవరైతే ఫ్యామిలీలతో ఉన్నారో వాళ్లు ఆనందంగా గడపండి` అంటూ కామెంట్ చేశాడు సంజయ్ దత్‌. లాక్‌ డౌన్‌ సమయంలోనూ భార్య పిల్లలతో వీడియో కాల్‌ ద్వారా టచ్‌లో ఉన్న సంజయ్ దత్‌ ప్రత్యక్షంగా వాళ్లతో గడప లేకపోతున్నా అన్న బాధను వ్యక్తం  చేశాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I miss them so much❤️ To everyone who is with their families right now, cherish them!

A post shared by Sanjay Dutt (@duttsanjay) on Jun 15, 2020 at 11:58pm PDT