చాలామంది 60 ఏళ్లు దాటితే చాలు ఆనోప్పులు, ఈనొప్పులు అంటూ కదలడానికే ఇబ్బందిపడుతుంటారు. కాని 74 ఏళ్ల వయస్సులో కూడా తమిళ సూపర్ స్టార్ ఫిట్ నెస్ కోసం గట్టిగా కష్టపడుతున్నాడు. ఈ ఏజ్ లో రజినీకాంత్ చేసిన ఫీట్స్ కు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 

DID YOU
KNOW
?
50 ఏళ్ళ ఫిల్మ్ కెరీర్
సూపర్ స్టార్ రజినీకాంత్ 50 ఏళ్ల సినిమా జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. 1976 నుంచి ఆయన నటించడం మొదలు పెట్టారు.

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఏడు పదుల వయస్సు దాటినా ఏమాత్రం తగ్గకుండా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఎంత మంది కొత్త హీరోలు వచ్చినా.. స్టార్ హీరోగా రజినీకాంత్ స్థానం మాత్రం పొందలేకపోతున్నారు. తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రస్తానం పూర్తి చేసుకున్నాడు తలైవా. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కలిగి ఉన్న రజినీకాంత్ 50 ఏళ్ల ప్రస్తానం పూర్తి చేసుకున్ సందర్భంగా ప్రధాని మోదీ, చంద్రబాబు, ఇతర సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ఆయనకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు అందుతున్నాయి.

తమిళ సినీ దిగ్గజం రజనీకాంత్ 74 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్ పట్ల చూపిస్తున్న అంకితభావం అందరికి షాక్ ఇస్తోంది. ఈ ఏజ్ లో ఆయన జిమ్ లో వర్కౌట్లు చేస్తుంటే యంగ్ స్టార్స్ కూడా నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రజనీకాంత్ జిమ్‌లో శ్రమిస్తూ కనిపించారు. తన వ్యక్తిగత ట్రైనర్ పర్యవేక్షణలో వర్కౌట్స్‌ చేస్తున్నారు. బరువులు ఎత్తుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ ఎక్స్ లో షేర్ చేశారు.

Scroll to load tweet…

వీడియోలో మొదట రజనీకాంత్ ‘ఇన్‌క్లైన్ డంబెల్ ప్రెస్’ చేస్తూ కనిపించారు. ఇది సాధారణంగా చాతీ పై భాగాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడే వ్యాయామం. వీడియోలో కనిపిస్తున్నట్లు, రజనీకాంత్ వాలుగా ఉన్న బెంచ్‌పై పడుకుని రెండు చేతులతో డంబెల్స్‌ను పట్టుకొని చేతుల కండరాలకు పని చెబుతున్నారు. అయితే సాధారణంగా ఈ వ్యాయామం యంగర్స్ చేస్తుంటారు. కాని తలైవా మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా డంబెల్స్ మోస్తూ.. యూత్ కు ఆదర్శంగా నిలుస్తున్నారు.

వీడియోలో నెక్ట్స్ రజనీకాంత్ జిమ్ బెంచ్‌పై కూర్చుని 'స్క్వాట్స్' చేస్తూ కనిపించారు. తన శరీరాన్ని మళ్లీ మళ్లీ పైకెత్తుతూ ఈ వ్యాయామాన్ని ఎక్కువసార్లు చేశారు. ఈ తరహా స్క్వాట్స్ కాలు కండరాల బలాన్ని పెంచడానికి, శరీరం ఫిట్ గా, నడకను బ్యాలన్స్ చేయడానికి దోహదపడతాయి. వీడియో చివరిలో రజనీకాంత్ తన ఫిట్‌నెస్ కోచ్‌తో కలిసి కండలు ప్రదర్శిస్తూ కనిపించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై ఎక్కువ ఫోకస్ చేశారు. వయసు పెరిగేకొద్ది శరీరాన్ని, మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ తగినంత వ్యాయామం చేస్తూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రజినీకాంత్ సినిమాల ద్వారా వచ్చే ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు. రాజకీయాల్లో రావాలి అనుకున్న సూపర్ స్టార్ తన ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తుందన్న కారణంతో డ్రాప్ అయ్యారు. ప్రస్తుతం సినిమాల మీద మాత్రమే ఫోకస్ చేశారు తలైవా.

YouTube video player

ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కూలీ’ ఈ నెల 14న విడుదలైంది. ఈ సినిమాలో నాగార్జున అక్కినేని విలన్ పాత్రలో నటించగా. మలయాళ స్టార్ సౌబిన్ షాహిర్, కన్నడ హీరో ఉపేంద్ర, హీరోయిన్ శ్రుతి హాసన్, సత్యరాజ్, రచ్చిత రామ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమా కోసం పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ కు భారీ ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. మోనికా అంట సాగే పాటు రీల్స్ లో మారుమోగుతోంది.