Asianet News TeluguAsianet News Telugu

రజనీకాంత్ షాకింగ్ లుక్, పొట్టినిక్కరు,చెప్పులు లేకుండా.. బీచ్ లో సూపర్ స్టార్..

సూపర్ స్టార్ రజనీకాంత్ షాకింగ్ లుక్ లోకనిపించారు. షూటింగ్స్ కంప్లీట్ చేసుకున్న ఆయన..ఎప్పుడు లేని విధంగా రిలాక్స్ అవ్వడం కోసం మాల్దీవ్స్ కు వెళ్లాడు. 

Superstar Rajinikanth Relax  in Maldives Beach JMS
Author
First Published Jul 19, 2023, 11:36 AM IST

ఏడు పదుల వయస్సులో కూడా యువకుడిలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ.. సూపర్ ఫాస్ట్ గా వాటిని పూర్తి చేస్తూ.. సూపర్ స్టార్ దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన జైలర్ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. దానితో పాటు తన గారాల కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్ సలాం షూటింగ్ కూడా రీసెంట్ గానే కంప్లీట్ చేశారు.  ఈరెండు సినిమాల్లో తలైవా పోర్షన్ షూట్ అయిపోయింది. దాంతో రజనీకాంత్ కు గ్రాండ్ సెండాఫ్ కూడా ఇచ్చారు రెండు సినిమాల టీమ్. 

ఇక నెక్ట్స్ రజనీకాంత్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నారు. ఆలోపు రెండు సినిమాలు కంప్లీట్ చేసి అలసిపోయిన తలైవా.. రిలీజ్ అవ్వడం కోసం మాల్దీవ్స్ కు వెళ్లారు. ఎప్పుడూ లేని విధంగా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు రజనీకాంత్. బీచ్ లో పొట్టినిక్కరు వేసుకుని టీషర్డ్ తో పాటు.. కాళ్ళకు చెప్పులు లేకుండా.. ఒంటరిగా రజనీకాంత్.. ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు నెట్టింట్లో ఈ ఫోటోపై రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. 

 

ఇక రజనీకాంత్ తాజాగా నటించిన 'జైలర్' సినిమా ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.  నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రజనీకాంత్ జోడీగా  తమన్నా నటించింది. అంతే కాదు  ఈ సినిమాలో మలయాళ  స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. అలాగే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్, వినాయకన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను నిర్మించింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ కాబోతోంది మూవీ. ఇక జైలర్ నుంచి రిలీజ్ అయిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి వచ్చిన  ఫస్ట్ సింగిల్ 'కావాలయ్యా' యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 40 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకొని దూసుకుపోతోంది.

జైలర్' సినిమా తరువాత తన కూతురు..ధనుష్ మాజీ భార్య  ఐశ్వర్య దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్' సినిమా కూడా రెడీ అవుతోంది. రీసెంట్ గా తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాడు రజనీకాంత్. ఈమూవీలో 'మోయిదీన్ భాయ్' అనే పేరుగల మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నారు రజనీకాంత్. ఇక ఈరెండు సినిమాల తరువాత లోకేష్ కనగరాజ్ కు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios