మరో చిన్నారి ప్రాణం కాపాడిన సూపర్ స్టార్ మహేష్ బాబు, నువ్వు దేవుడు సామీ..
ఖాలేజా సినిమాలో మహేష్ బాబును దేవుడిలా కొలవడం యాదృచికంగా పెట్టారో.. లేక కావాలని పెట్టారో తెలియదు కాని.. ప్రస్తుతం ఎంతో మంది చిన్నారుల పాలిట ఆయన నిజంగానే దేవుడిలా మారాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాలేజాలో ఓ అడివి జాతివారిని ఉద్దరించే దేవుడిలా కనిపించాడు. కాని బయట కూడా సూపర్ స్టార్ చిన్నారుల పాలిట దేవుడి అవతారంఎత్తాడు. తన ఫౌండేషన్ ద్వారా ఆగిపోబోతున్న ఎందరో చిన్నారులకు గుండెలకు ప్రాణం పోశాడు. చిన్నారులకు గుండె ఆపరేషన్‌లు చేయిస్తూ.. వారి పాలిట భవంతుడైపోయాడు మహేష్ బాబు. ఆయన ఇంత వరకూ వేల మందికి ఇలా సాయం చేస్తున్నా.. ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఈమధ్య కాలంలోనే ఈ విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే 2000 లకు పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించిన మహేష్.. ప్రస్తుతం మరో చిన్నారికి ప్రాణం పోశాడు.
మహేష్ బాబు ఈ పనికోసం ప్రత్యేకంగా ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఆయన ఆధ్వర్యంలో హార్ట్ ఆపరేషన్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా మహేష్ బాబు మరో ఏడేళ్ల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు. క్రాంతి కుమార్ అనే ఏడేళ్ల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు మహేష్ బాబు. ఈ బాలుడు టెట్రాలజీ ఆఫ్ ఫాలట్ అనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. అయితే చికిత్స చేయించేంత స్తోమత లేకపోవడంతో.. బాధలో మునిగి ఉన్న ఆ ఫ్యామిలీని మహేష్ బాబు ఆదుకున్నాడు. వీరి సమస్య కాస్త మహేష్ బాబు దృష్టికి వెళ్లడంతో.. ఆయన క్రాంతి కుమార్ గుండె ఆపరేషన్‌కు సాయం చేశారు.
క్రాంతి కుమార్ కు ఆంధ్రా ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ జరిగింది. ప్రసుత్తం క్రాంతి ఆరోగ్యం కుదుట పడటంతో.. వారి తల్లీ తండ్రులు సూపర్ స్టార్ ను దేవుడిలా కొలుస్తున్నారు. ఆయన రుణం తీర్చుకోలేమంటున్నారు. చిన్న పిల్లలకే ఇలా సాయం చేయడం వెలనకాల మహేష్ బాబుకు సబంధించి ఓ ప్లాష్ బ్యాక్ ఉంది. ఆయన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో ఈ విషయాన్ని వెల్లడించాడు.మహేష్ బాబు తనయుడు గౌతమ్ నెలలు నిండకుండానే పుట్టాడు. దాంతో గౌతమ్ ఆరోగ్యం గురించి మహేష్ దంపతులు ఎంతో ఆందోళన చెందారు. ఈ సంఘటనే మహేష్ బాబు ఫౌండేషన్‌కి బాటలు వేసింది అని బాలయ్య బాబు ఇంటర్వ్యూలో వెల్లడించాడు మహేష్.