మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళ చిత్ర పరిశ్రమకి రెండు కళ్లలాంటివారు. రెండు పిల్లర్లు అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఇద్దరు సూపర్ స్టార్లు మంచి స్నేహితులు. సినిమాలకు అతీతంగా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.
కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, సూపర్ స్టార్ మమ్ముట్టి ఒకే ఫ్రేములో కనిపిస్తే కనువిందుగా ఉంటుంది. ఇది వారి అభిమానులకే కాదు, సినీ ప్రియులకు కూడా చూడముచ్చటగానూ ఉంటుంది. అలాంటి అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని తాజాగా మోహన్‌లాల్ అభిమానులతో పంచుకున్నారు. అనేక వార్తలను క్రియేట్ చేశారు.
మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళ చిత్ర పరిశ్రమకి రెండు కళ్లలాంటివారు. రెండు పిల్లర్లు అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఇద్దరు సూపర్ స్టార్లు మంచి స్నేహితులు. సినిమాలకు అతీతంగా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరు కలిసి పలు సినిమాల్లోనూ నటించారు. తాజాగా ఊహించని విధంగా వీరు ఒకే ఫ్రేములో కనిపించడం అభిమానులను సంబరానికి గురి చేస్తుంది. ఫ్యాన్స్ కిది కనువిందునిస్తుంది. అయితే ఇద్దరి కలయికలోని ఆంతర్యం ఏంటనేది ఆసక్తి నెలకొంది. ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారా? లేక స్నేహపూర్వకంగా కలిశారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
With Ichakka pic.twitter.com/gKn6d8auMR
— Mohanlal (@Mohanlal) January 7, 2021
ప్రస్తుతం మోహన్‌లాల్ `దృశ్యం2`, `రామ్`, `ఆరాట్టు` చిత్రాల్లో నటిస్తుంది. `మరక్కర్‌ః అరేబియన్‌సింహం` విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు మమ్ముట్టి `ది ప్రీస్ట్`, `వన్` చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. దాదాపు అటు ఇటు ఒకే టైమ్‌లో వీరిద్దరు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 7, 2021, 8:59 PM IST