అందరూ అనుకుంటున్నట్టుగానే తన 169వ సినిమాను ప్రకటించారు తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్(Rajinikanth). గత కొంత కాలంగా యంగ్ డైరెక్టర్లను బాగా ఎంకరేజ్ చేస్తన్నారు. తన  ఆరోగ్యం బాగోలేకపోయినా. సినిమాలను మాత్రం ఆపడంలేదు. యంగ్ స్టార్స్ కు లైఫ్ ఇచ్చే బాధ్యత తీసకున్నారు సూపర్ స్టార్.

అందరూ అనుకుంటున్నట్టుగానే తన 169వ సినిమాను ప్రకటించారు తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్(Rajinikanth). గత కొంత కాలంగా యంగ్ డైరెక్టర్లను బాగా ఎంకరేజ్ చేస్తన్నారు. తన ఆరోగ్యం బాగోలేకపోయినా. సినిమాలను మాత్రం ఆపడంలేదు. యంగ్ స్టార్స్ కు లైఫ్ ఇచ్చే బాధ్యత తీసకున్నారు సూపర్ స్టార్.

ఈ మధ్య ఆరోగ్యం సహకరించకపోవడంతో ఎక్కవగా ఇంటికే పరిమితం అయ్యారు సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajinikanth). రాజకీయాల్లోకి రావాలి అనుకుని కూడా ఆరోగ్యం సహకరించకనే వెనకడుగు వేశారు రజని. కాని తనకు ఎంతో ఇష్టమైన సినినిమాలు మాత్రం ఆపలేకపోతున్నారు స్టార్ సీనియర్ హీరో. సాధ్యమైనంత వరకూ సినిమాలు చేయడానికే ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే శివ దర్శకత్వంలో అన్నాత్తే మూవీచేశారు సూపర్ స్టార్ రజనీ కాంత్ (Rajinikanth). ఈ మూవీ షూటింగ్ టైమ్ లో కూడా అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడ్డారు రజనీ కాంత్(Rajinikanth). అయినా సరే అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసకుని వచ్చి మళ్ళీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు కొంచెం ఆరోగ్యం సహకరిస్తుండటంతో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు తలైవా. తన 169వ సినిమాను ప్రకటించేశారు. అది కూడా యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నాట్టు అనౌన్స్ చేశారు.

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ తో సినిమా చేస్తున్నారు తలైవా. దీనికి సబంధించిన పోస్టర్ తో పాటు స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు టీమ్. రజనీ కాంత్ హీరో గా నెల్సన్ దిలీప్ డైరెక్షన్ తో పాటు.. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈమూవీకి మ్యూజిక్ చేయబోతున్నాడు. ఈ వీడియో లో కూడా దిలీప్ తో పాటు అనిరుద్ కనిపించాడు. చివరిగా తలైవా స్టైలీష్ గా కూర్చోని కళ్లద్దాలు పెట్టుకుంటూ కనిపించాడు.

YouTube video player

ప్రస్తుతం తమిళనాట యంగ్ డైరెక్టర్ల లిస్ట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నెల్సన్ దిలీప్. నయనతారతో కొలమావు కోకిల, శివకార్తికేయన్ తో డాక్టర్ సినమాలు తెరకెక్కించారు నెల్సన్. ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా మంచి విజయం సాధించారు. ఇక ప్రస్తుతం స్టార్ హీరో విజయ్ తో బీస్ట్ మూవీ చేస్తున్నాడు నెల్సన్. సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.

ఈ మధ్య యంగ్ డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చే బాధ్యత తీసుకున్నారు రజనీ కాంత్ (Rajinikanth). గత ఐదారుఏళ్ళ నుంచీ యంగ్ స్టార్స్ తోనే సినిమాలు చేస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజ్, పా రంజిత్. శివ లాంటి యంగ్ డైరెక్టర్స్ కు ఇప్పటికే కోలీవుడ్ లో లైఫ్ ఇచ్చారు రజనీ కాంత్. అదే క్రమంలో ఇప్పుడు మరో సారి యండ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కు ఛాన్స్ ఇచ్చారు సూపర్ స్టార్(Rajinikanth) .

ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించబోతున్నారు. సూపర్ టార్ లాస్ట్ టైమ్ శివ డైరెక్షన్ లో నటించిన అన్నాత్తే సినిమాను కూడా సన్ పిక్చర్స్ వారే నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా తెలుగులో పెద్దన్న టైటిల్ తో టాలీవుడ్ లో రిలీజ్ అయ్యింది. అయితే రెండు బాషల్లో ఈ మూవీ ఆడియన్స్ ను డిస్సపాయింట్ చేసింది.