'కేజీఎఫ్ చాప్టర్ 2' సైతం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రాంతంతో తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలోనూ వసూళ్ళ పరంపరను కొనసాగించింది.
రజనీకాంత్ కొత్త సినిమా గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సంస్ద రజనీతో సినిమా చెయ్యబోతోంది. కన్నడ స్టార్ యష్ నటించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' ఎంత హిట్అయ్యాయో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో భాగం రిలీజై రీసెంట్ గా ఏడాది పూర్తి చేసుకుంది. ఇప్పుడిదే నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తో రజనీ సినిమా చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ డైరక్టర్ ఎవరూ అంటే..
రజనీ నెక్ట్స్ సినిమాని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నారని సమాచారం. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. కథలు వేరైనా ఒక సినిమాలోని పాత్రలను మరో సినిమాలో చూపిస్తూ సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేసిన ఆయనకు తెలుగులోనూ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా ప్రస్తుతం ‘లియో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన రజనీకాంత్‌తో ఓ సినిమా చేయబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. తెలుగు మీడియాలోనూ దీనిపైన చర్చ సాగుతోంది. కేజీఎఫ్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారు ఈ ప్రాజెక్టుని నిర్మించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ అప్టేడ్ అయితే మాత్రం లేదు.
ఈ నేపధ్యంలో #Thalaivar171 (రజనీకాంత్ 171వ చిత్రం) #LokeshKangaraj (లోకేశ్ కనగరాజ్) హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్ ట్రెండింగ్ జాబితాలో నిలిచాయి. లోకేశ్ ఇప్పటికే రజనీకాంత్‌తో సినిమా చేయాల్సిఉందని, పలు కారణాల వల్ల వాయిదా పడిందని, అతి త్వరలోనే రజనీకాంత్‌ని కలిసి లోకేశ్ మరోసారి చర్చలు జరపనున్నారని సమాచారం. లోకేశ్ దర్శకత్వంలో నటించేందుకు రజనీ ఆసక్తిగా ఉన్నారని సినీ వర్గాల టాక్. రజనీకాంత్‌తో తీసే చిత్రాన్ని లోకేశ్ తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం చేస్తారని పలువురు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమాటిక్ యూనివర్స్‌కాకుండా సెపరేట్‌గానే తెరకెక్కించే అవశాలున్నాయని మరికొందరు అంటున్నారు.
‘మాస్టర్’ తర్వాత విజయ్ హీరోగా లోకేశ్ తెరకెక్కిస్తున్న ‘లియో’ (Leo).. ఈ ఏడాది అక్టోబరు 19న విడుదల కానుంది. రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ (Jailer) సినిమాలో నటిస్తున్నారు. దానికి నెల్సన్ దర్శకుడు. మరోవైపు, తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లాల్ సలామ్’లో రజనీ కీలక పాత్ర పోషిస్తున్నారు. కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో తాను తెరకెక్కించిన ‘విక్రమ్’లో ‘ఖైదీ’లోని హీరో కార్తి పాత్రను చూపించి లోకేశ్ మంచి థ్రిల్ పంచారు.
సూపర్ స్టార్ అభిమానులకు ఈ వార్త చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకు అంటే... కమల్ హాసన్ 'విక్రమ్' వసూళ్లు, విజయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లోకనాయకుడికి భారీ విజయాన్ని అందించిన లోకేష్ కనగరాజ్, తలైవా రజనీకి కూడా భారీ హిట్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
