Asianet News TeluguAsianet News Telugu

సూపర్ స్టార్ సూపర్ స్పీడ్, వెట్టయాన్ నుంచి క్రేజీ అప్డేట్.. కేన్స్ లో `కన్నప్ప` టీజర్ , ఎప్పుడంటే

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం వెట్టయాన్. జై భీమ్ ఫేమ్ టిజి జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

Super Star Rajinikanth Vettaiyan and Manchu Vishnu Kannappa movie updates dtr
Author
First Published May 13, 2024, 10:10 PM IST

వెట్టయాన్ షూటింగ్ ఫినిష్ చేసిన రజనీ 

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం వెట్టయాన్. జై భీమ్ ఫేమ్ టిజి జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగులో ఈ చిత్రం వేటగాడు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ చిత్రంలో రజనీకాంత్, అమితాబ్ కలసి నటించబోతున్నారు. టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. 

Super Star Rajinikanth Vettaiyan and Manchu Vishnu Kannappa movie updates dtr

కాగా ఈ చిత్రంలో తన పార్ట్ షూటింగ్ ని తలైవా ఫినిష్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ నేడు అధికారికంగా ప్రకటించింది. ఇతర నటీనటులపై ఉన్న సన్నివేశాలని కూడా దర్శకుడు త్వరలో పూర్తి చేయబోతున్నారు. 

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విష్ణు మంచు ‘కన్నప్ప’ సందడి

విష్ణు మంచు కన్నప్ప సినిమాను మే 20న కేన్స్‌లో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో "ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప"గా ఆవిష్కరించనున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తుండటం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది.

"ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప" కేవలం సినిమా కాదు.. ఇది ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కానుంది. కథను చెప్పే విధానాన్ని పునర్నిర్వచించబోతోంది. ఇక రెడ్ కార్పెట్ మీద ఈ సినిమా రాక కోసం అందరూ చూస్తుండగా.. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విష్ణు మంచు తన టీంతో కలిసి తెలుగు చిత్రసీమలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచేలా కన్నప్పను తెరకెక్కిస్తున్నారు.
Super Star Rajinikanth Vettaiyan and Manchu Vishnu Kannappa movie updates dtr
"కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'కన్నప్ప' టీజర్‌ను ఆవిష్కరించబోవటం మాకు చాలా ఆనందంగా ఉంది" అని విష్ణు మంచు ట్వీట్ వేశారు. "ప్రపంచ ప్రేక్షకులకు మేం ఎంతో ఇష్టంగా రూపొందించిన కన్నప్పను ప్రదర్శించడానికి కేన్స్ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అన్నారు.

"ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప" కేన్స్ అరంగేట్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇది గ్లోబల్ సినిమా ల్యాండ్‌స్కేప్‌లో చెరగని ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. ఆకర్షణీయమైన కథనం, అద్భుతమైన చిత్రీకరణ, భారీ తారాగణంతో, అందరికీ ఓ మంచి అనుభూతినిచ్చేలా సినిమాను రూపొందిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios