సూపర్ స్టార్ రజనీ కాంత్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. అది కూడా 70 ఏళ్లు దాటిన వయస్సులో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఇప్పటి వరకూ నటుడిగా ఉన్న ఈ స్టార్ హీరో రచయితగా మారబోతున్నారు.  

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తెలియ‌ని సినీప్రేక్ష‌కుడు ఉండ‌డేమో. పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా.. జపాన్ లాంటి దేశాల్లో కూడా ఫ్యాన్ బేస్ ఉన్నసూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలంగా సినిమాల విషయంలో నిర్లష్యంగా ఉన్నారు అని అభిమానులు ఫీల్అవుతున్నారు. అయితే గ‌త కొంత కాలంగా ర‌జినీకాంత్ నుంచి అభిమానులు ఆశించిన స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. దాంతో సూపర్ స్టార్ నుంచి సాలీడ్ సినిమాకోసం ఎదురు చూస్తున్నారు. 

నిజానికి 2010 లో వచ్చిన రోబో త‌రువాత ఇప్ప‌టివ‌ర‌కు ర‌జినీకి ఆ స్థాయి హిట్ లేదు. మ‌ధ్యలో భారి అంచ‌నాల‌ తో విడుద‌లైన క‌బాలి ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. అయితే 2019లో వ‌చ్చిన పేట మాత్రం పర్వాలేదు అనిపించింది. కాని ఈసినిమా కూడా అభిమానుల‌కు మాత్రం ఫుల్ మీల్స్ పెట్ట‌లేక‌పోయింది. ఇక దీని త‌ర్వాత వ‌చ్చి న ద‌ర్బార్‌, పెద్ద‌న్నలాంటి సినిమాలు ప‌రాజ‌యాలుగానే మిగిలిపోయాయి.

 ప్ర‌స్తుతం రజినీ హిట్ కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే నెల్స‌న్‌ దిలీప్ కుమార్ తో మూవీ చేయబోతున్నాడు. డాక్ట‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ ఇచ్చిన నెల్సన్‌.. బీస్ట్ వంటి భారీ ఫ్లాప్‌ కూడా ఇచ్చాడు. అయిన‌ప్ప‌టికి ర‌జినీకాంత్, నెల్స‌న్‌తో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు. అయితే ఈ సినిమా రజనీ కాంత్ కు 169వ సినిమా కాగా.. ఈ సినిమాకు ర‌జినీకాంత్ స్వ‌యంగా క‌థ‌ను అందిస్తున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. 

అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఐశ్వ‌ర్య‌రాయ్‌, ర‌మ్య కృష్ణ‌, ప్రియాంక అరుళ్ మోహ‌న్‌, శివ‌ రాజ్‌ కుమార్ లాంటి స్టార్ కాస్ట్ కనువిందు చేయబోతున్నారు.. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులను జ‌రుపుకుంటున్న ఈ సినిమా జూలైలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ కథలపై మంచి పట్టు ఉంది అని నిరూపించుకున్న రజనీకాంత్ స్వయంగా రాసుకున్న కథ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఈగర్ గావెయిట్ చేస్తున్నారు.