Asianet News TeluguAsianet News Telugu

మరోసారి అతిధి పాత్రలో రజినీకాంత్.. ఈసారి చిన్నకూతురి కోసం తలైవా..

పెద్ద కూతురు వంత అయిపోయింది.. ఇక చిన్న కూతురు వంత వచ్చింది. అవును.. సూపర్ స్టార్ రజినీకాంత్ తన చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్ కోసం మరోసారి గెస్ట్ రోల్ చేయడానికి రెడీ అయ్యారట. 
 

Super Star Rajinikanth Gest Role Onec againe Raghava laowrance Movie JMS
Author
First Published Feb 9, 2024, 8:55 AM IST | Last Updated Feb 9, 2024, 8:55 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ చిత్రం ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. తమిళనాట ఎలా ఉన్నా..ఇతర భాషల్లో మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది.  ఈసినిమాలో మోయిదీన్ భాయ్ గా అతిధి పాత్రలో నటించారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక మరోసారి ఆయన అతిధిపాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. 

 ఈ సినిమాలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించగా, సెంథిల్ మరియు లివింగ్స్టన్ యొక్క తంబి రామయ్య వంటి తమిళ  ప్రముఖ నటులు కూడా సినిమాలో నటించారు. ఈ రిలరీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేయడంతో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఈక్రమంలో మరోసారి సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

 మొదట పెద్ద కూతురు ఐశ్వర్య  రజినీకాంత్ కోసం లాల్ సలాం లో గెస్ట్ రోల్ చేసిన తలైవా.. ఇప్పుడు చిన్న కూతురు కోసం రంగంలోకి దిగుతున్నాడట.  ఈ నేపధ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజనీకాంత్ తదుపరి చిత్రంలో నటిస్తున్న  కొంత సమాచారం లీక్ అయ్యింది. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని, నటుడు-దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారట. 

లాల్ సలామ్ మాదిరిగానే, రజనీ చిన్న కుమార్తె దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కూడా  సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న అతిధి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.. ఈ విషయాలు ప్రకటించలేదు. కాని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ లో మాత్రం ఈ విషయంపై టాక్ గట్టిగా నడుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios