రజినీకాంత్ తండ్రిని ఎప్పుడైనా చూశారా..? వైరల్ అవుతున్న ఫోటో..
సూపర్ స్టార్ రజినీకాంత్ వయస్సు ప్రస్తుతం 73 ఏళ్ళు.. మరి ఆయన తండ్రి ఎవరో మీకు తెలుసా..? ఎప్పుడైనా ఆయన ఫోటో చూశారా.. ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతున్న ఫోటో తలైవా తండ్రిదేదా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండియా గర్వించదగ్గ నటులలో ఆయన ఒకరు. తమిళనాడులోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు తలైవాకు. ఆయన వయస్సు ప్రస్తుతం 73 ఏళ్లు.. అయినా రజనీకాంత్ సినిమారిలీజ్ ను ఇప్పటికీ పండగలా జరుపుకుంటారు.రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా 23 రోజుల్లో రూ.640 కోట్లు వసూలు చేసి పలు రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన 2వ తమిళ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా నిలిచారు. ప్రస్తుతం రజనీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేదతియాన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. అలాగే, రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈసినిమాను ఆయన కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేసింది.
ఇక అసలు విషయం ఏంటంటే.. అప్పుడప్పుడు ప్రముఖుల రేర్ పిక్స్ బయటకు రావడం సహజం. ఈసారి సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి ఎప్పుడూ ఎవ్వరూ ఇంత వరకూ చూడని ఫోటో ఒకటి బయటకు వచ్చింది. రజనీ కండక్టర్‌గా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఆయనతల్లిదండ్రులతో ఉన్న ఫోటోలు ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ప్రస్తుతం రజనీ తన తండ్రితో కూర్చొని మాట్లాడుతున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా రజినీ తల్లిదండ్రులు రామోజీ రావ్ జైక్వాడ్ జీజాభాయ్.