Asianet News TeluguAsianet News Telugu

రజినీకాంత్ ను చుట్టు ముట్టిన అభిమానులు, ఆంధ్రప్రదేశ్ లో తలైవా క్రేజ్..

సూపర్ స్టార్ అంటే సూపర్ స్టారే.. తమిళంలో ఆయనకు ఎంత క్రేజ్ ఉందో ఇతర భాషల్లో కూడా అంతే క్రేజ్ ఉంది తలైవాకు. అది తాజాగా మరోసారి ఫ్రూ అయ్యింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో..

Super Star Rajinikanth craze in Andhra Pradesh Video Viral JMS
Author
First Published Feb 6, 2024, 9:47 AM IST | Last Updated Feb 6, 2024, 9:47 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాట ప్రభంజనం సృష్టించిన తలైవాకు.. అదే క్రేజ్ ఉంటుంది ఇతర ఇండస్ట్రీలో. ముఖ్యంగా తమిళంతో పాటు.. తెలుగులో ఎక్కువఅభిమానులున్నారు ఇక రజినీకాంత్ అతిధి పాత్రలో నటించిన లాల్ సలామ్ ఫిబ్రవరి 9న థియేటర్లలోకి రానుంది. దీని తర్వాత రజనీకాంత్ ప్రధాన పాత్రలో వేదతియాన్ సినిమా రూపొందనుంది. జై భీమ్ దర్శకుడు టీఎస్ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

లైకా సంస్థ భారీ బడ్జట్ తో ఈసినిమాను  నిర్మిస్తోంది. రజనీకాంత్‌తో పాటు మంజు వారియర్, భగత్ బాసిల్, రానా దగ్గుపాటి, రితికా సింగ్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ టీవీ సెలబ్రిటీ వీజే రక్షన్ కూడా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి దశ షూటింగ్ కేరళలో, రెండో దశ షూటింగ్ తమిళనాడులో జరిగింది.

ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వేదతియాన్ మూడో దశ షూటింగ్ జరుగుతోంది. తులసి, రజనీకాంత్, రానా దగ్గుపాటికి సబంధించిన సీన్స్ ను  భగత్ చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ జరుగుతుండగా.. రజినీకాంత్ వచ్చినట్టు తెలుసుకుని  షూటింగ్ సైట్‌లో పెద్ద ఎత్తున అభిమానులు గుమ్మిగూడారు. అంత కాదు  రజనీకాంత్‌ను చూసేందుకు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి  అభిమానులు భారీ ఎత్తున  ఎగబడటంతో  అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. 

 

ఇక షూటింగ్ స్పాట్ నుంచి కారులో బయలుదేరిన రజనీ అభిమానులు చుట్టుముట్టారు. తలైవా అంటూ హోత్తిన నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగింది. ఇక అభిమానుల కోసం ఆయన ఓపెన్ టాప్ నుంచి బయటకు వచ్చి.. అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. అభిమానులు చుట్టుముట్టడంతో.. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని రక్షణ కలిపించారు. రజినీకాంత్ వెళ్ళడానికి దారి చేసి.. అభిమానులు కంట్రోల్ చేస్తూ.. తలైవాను సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా.. దీన్ని చూసిన నెటిజన్లు ఆంధ్రప్రదేశ్‌లో కూడా రజనీకి ఇంత మాస్ ఫాలోయింగ్  ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios