సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి త్వరలో రాబోతున్న చిత్రం 'జైలర్'.  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా ఈ చిత్రంలో సూపర్ స్టార్ కి జోడిగా నటిస్తోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి త్వరలో రాబోతున్న చిత్రం 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా ఈ చిత్రంలో సూపర్ స్టార్ కి జోడిగా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన 'కావాలి' అనే సాంగ్ యూట్యూబ్ లో పెను సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా తమన్నా స్టెప్పులపై నెటిజన్లు, సెలెబ్రిటీలు రీల్స్ చేస్తున్నారు.

ఆగష్టు 10న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో సూపర్ స్టార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రజనీ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా కూడా చర్చనీయాంశంగా మారాయి. 

తాను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు గురించి చెబుతూ రజనీ బాధపడ్డారు. మద్యం సేవించడం నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. ఆ అలవాటు లేకుంటే ఇప్పటికే నేను సమాజ సేవ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడున్న స్థాయి కంటే మంచి పొజిషన్ లో ఉండేవాడిని. నువ్వు రాజులాంటోడివి మందు తాగొద్దు అని నా తమ్ముడు హెచ్చరించాడు. కానీ నేను వినలేదు. ఆల్కహాల్ అనేది నా లైఫ్ కి దూరంగా ఉండి ఉంటే గొప్ప స్థాయిలో సేవ చేస్తూ ఉండేవాడిని అని సూపర్ స్టార్ అన్నారు. 

మద్యం మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ సభ్యుల సంతోషాన్ని కూడా నాశనం చేస్తుంది. అలాగని మద్యం పూర్తిగా తాగవద్దు అని చెప్పను. ఎప్పుడైనా ఒకసారి తాగండి. రోజూ మాత్రం అలవాటు చేసుకోవద్దు అని సూపర్ స్టార్ హితవు చెప్పారు. ఆ మధ్యన రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సన్నాహకాలు చేసుకున్నారు. కానీ ఆరోగ్య కారణాల రీత్యా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. 

ఇప్పుడు రజనీ చేసిన వ్యాఖ్యలు పాలిటిక్స్ గురించేనా అనే చర్చ జరుగుతోంది. మద్యం అలవాటు లేకుండా ఆరోగ్యం పర్ఫెక్ట్ గా ఉంటే పాలిటిక్స్ లో ప్రజాసేవ చేస్తూ ఉండేవాడిని అని రజనీ చెప్పకనే చెప్పారా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్లలేక పోయానని అసంతృప్తి సూపర్ స్టార్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా గొప్ప పొజిషన్ అంటే సీఎం పదవేనా అని అంటున్నారు.