Asianet News TeluguAsianet News Telugu

కూతురికి మహేష్ బర్త్‌ డే విషెస్‌.. ఇంట్రస్టింగ్‌ వీడియో షేర్ చేసిన సూపర్‌ స్టార్‌

ఈ రోజు తన ముద్దుల కూతురి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశాడు. సితార చిన్నప్పటి నుంచి తీసిన ఫోటోలను వీడియోలను కలిపి ఓ వీడియో రూపంలో పోస్ట్ చేసి సీతూ పాపకు విషెస్ చెప్పాడు. మహేష్‌తో పాటు నమ్రత, గౌతమ్‌లు కూడా సితారకు విషెస్‌ చెప్పారు.

Super Star Mahesh Babu Wishes Daughter Sitara
Author
Hyderabad, First Published Jul 20, 2020, 10:55 AM IST

సూపర్‌ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాలపట్టి సితార పుట్టిన రోజు నేడు. మహేష్ పిల్లు ఇద్దరు ఇప్పటికే సెలబ్రిటి స్టేటస్ అందుకున్నారు. అందుకే అభిమానులు మహేష్‌తో పాటు గౌతమ్‌, సితారలకు సంబంధించి అకేషన్స్‌ను కూడా పండగలా సెలబ్రేట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సితార పుట్టిన రోజు కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతుంది. ఇక మహేష్ విషయానికి వస్తే షూటింగ్‌లలో ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తాడు మహేష్‌.

అంతేకాదు ప్రతీ సినిమా పూర్తయిన తరువాత ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ట్రిప్‌కు వెళ్లటం మహేష్‌కు అలవాటు. ప్రస్తుతం కరోనా కారణంగా మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న మహేష్ బాబు పూర్తి సమయాన్ని ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు. తాను ఇంట్లో చిన్నారులతో కలిసి చేసే అల్లరినీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. ఈ రోజు తన ముద్దుల కూతురి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశాడు.

సితార చిన్నప్పటి నుంచి తీసిన ఫోటోలను వీడియోలను కలిపి ఓ వీడియో రూపంలో పోస్ట్ చేసి సీతూ పాపకు విషెస్ చెప్పాడు. మహేష్‌తో పాటు నమ్రత, గౌతమ్‌లు కూడా సితారకు విషెస్‌ చెప్పారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థలు కూడా సితారకు విషెస్‌ చెపుతూ ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios