చాలా సింపుల్ గా కనిపించే మహేష్ బాబు.. చాలా కాస్ట్లీ వస్తువులు వాడుతాడు. కాని అవి కూడా సింపుల్ గానే కనిపిస్తాయి. వాటిని పరీక్షగా చూస్తే కాని వాటి అసలు రూపం బయటకు రాదు. రీసెంట్ గా సూపర్ స్టార్ వాడే బ్యాగ్  కాస్ట్ విని షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.  

నెటిజన్ల కళ్ళంతా సెలబ్రిటీల మీదే ఉంటాయి. వాళ్లు పెట్టే పోస్ట్ లు.. వాడే వస్తువలు.. వాటి ఖరీదు.. ఇవే పనిగా పెట్టుకుని ఉంటారు కొంత మంది. సెలబ్రిటీలు కనిపిస్తే.. వారి వస్తువలమీద కళ్ళుంటాయి. పొరపాటున వారు వాడే వస్తువు రేర్ గా దొరికేదో.. లేక బాగా కాస్ట్లీదో అయ్యింటే... ఇక దాన్ని వైరల్ చేయడమే వారి పని. ఇక తాజాగా వారి కంటికి సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాగుతో సహా దొరికారు. 

మహేశ్ బాబు ఎప్పుడు చాలా సింపుల్‌గా ఉంటారు.. సింపుల్ గానే కనిపిస్తారు. హాంగు ఆర్బాటం ఉండదు.. ప్రశాంతంగా ఉంటాడు. ఆయన వేసుకునే బట్టలు.. వాడే వస్తువులు కూడా చాలా సింపులుగా అనిపిస్తాయి. కాని కాస్ట్ చూస్తే మాత్రం బుర్ర పేలిపోవాల్సిందే. పక్కా బ్రాండ్ మెయింటేన్ చేస్తూ.. సింపుల్ గా కనిపించేలా జాగ్రత్త పడుతుంటాడుసూపర్ స్టార్. చిత్రం ఏంటంటేం. ఏదైనా పార్టీలకు, సినిమా వేడుకలకు వచ్చినప్పుడు కూడా సాదాసీదాగానే ఉంటారు. అయితే వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు మాత్రం మహేష్ రిచ్ నెస్ తెలిసిపోతుంది. 

ఫ్యామిలీతో కలిసి ఏడాదికి ఐదారుసార్లు టూర్లు వెళ్తుంటాడు మహేష్. ఆటైమ్ లో కాస్టీ వస్తువుతో ఎక్కడ దొరికుతాడా అని ఎదురు చూస్తుంటారు నెటిజన్లు. ఇక తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో లూయిస్ విట్టన్ బ్యాగ్‌తో కనిపించాడు మహేష్. దాంతో నెటిజన్లు మొదలు పెట్టేశారు. ఈ బ్యాక్ ను వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతకీ దాని స్పెషల్ ఏంటీ.. దాని ధర ఎంత తెలుసా..? దాని ధర తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే.. 

తాజాగా ట్రిప్‌కు వెళ్లిన ఆయన.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాకు కనిపించారు. అప్పుడు మహేష్ భుజానికి కాస్ట్లీ లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎం.ఎం బ్యాక్‌ ప్యాక్‌తో కనిపించారు. దీంతో ఆ బ్యాగ్‌పై.. దాని ధరపే ఫోకస్ చేశారు నెటిజన్లు. ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా.. దాదాపుగా 4 లక్షలు.. అవునండీ.. 8 వేలు తక్కువ నాలుగు లక్షల బ్యాగ్ అది. దానిఅసలు ధర 3 లక్షల 92 వేల 656 రూపాయలు. ఈ విషయం తెలిసిన నెటిజన్లకు బుర్రతిరిగిపోయింది.

క్రిస్టోఫర్ ఎం.ఎం బ్యాక్‌ప్యాక్‌ను హై-ఎండ్ ఫ్యాషన్‌గా భావిస్తారు. నలుపు, నీలం డిజైన్‌తో ఎంతో అందంగా ఉంటుంది ఈ బ్యాగ్. ఎల్.వి మోనోగ్రామ్ సిగ్నేచర్ డిజైన్ కూడా బ్యాగ్‌పై ఉంది.స్టైల్ పరంగా మాత్రమే కాదు.. ఎంతో కంఫర్ట్ గా.. ఉపయోగకరంగా కూడా ఉంటుంది ఈ బ్యాగ్. అందమైన డిజైన్‌తో, విశాలమైన కంపార్ట్‌మెంట్లను కూడా ఈ బ్యాగ్ కలిగి ఉంటుంది. అది సంగతి. ఇక మహేష్ పక్కాగా ఫ్యామిలీ టూర్లు చేస్తుంటాడు. విరామం వచ్చినా లేకున్నా.. సినిమాల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరీ వెళ్లి ఎంజాయ్ చేస్తుంటాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో SSMB28 మూవీ చేస్తున్నాడు మహేష్. నెక్ట్స్ రాజమౌళితో కలిసి భారీ అడ్వెంచర్ కు రెడీ అవుతున్నాడు.