టాలీవుడ్ లో తొలి తరం  సూపర్ స్టార్, మహేష్ బాబు తండ్రి కృష్ణ. ఆతరంలో తెలుగు సినీ పరిశ్రమను ఏలిన వారిలో కృష్ణ ఒకరు.ఇక వృధాప్యంలో ఉన్న కృష్ణ రీసెంట్ లుక్ ఫ్యాన్స్ ను భయపెట్టింది. ఇంతకీ కృష్ణకు ఏమయ్యింది.   

టాలీవుడ్ లో తొలి తరం సూపర్ స్టార్, మహేష్ బాబు తండ్రి కృష్ణ. ఆతరంలో తెలుగు సినీ పరిశ్రమను ఏలిన వారిలో కృష్ణ ఒకరు.ఇక వృధాప్యంలో ఉన్న కృష్ణ రీసెంట్ లుక్ ఫ్యాన్స్ ను భయపెట్టింది. ఇంతకీ కృష్ణకు ఏమయ్యింది.

తెలుగు సినీ పరిశ్రమను శాసించిన అలనాటి స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ అప్పట్లో దూసుకుపోయారు. ఆ రోజుల్లో కృష్ణకు ఉన్నన్ని అభిమాన సంఘాలు మరెవరికీ లేవు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల హవాను తగ్గించి, ఆ ఊపులో హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకున్నారు కృష్ణ. 

ఇక ఇప్పుడు ఆయన వారసత్వం తీసుకున్న మహేష్ బాబు, కృష్ణ తరువాత టాలీవుడ్ లో సూపర్ స్టార్ బిరుదును కూడా పొందారు. ఇక కృష్ణ ఇప్పుడు వయోభారంలో ఉన్నారు. ఆయన ఇంటివద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లలో కనిపించడం తప్ప ఎక్కువగా ఎక్కడా కనిపించడం లేదు. 

రీసెంట్ గా కృష్ణకు సంబంధించిన ఒక ఫొటో నెట్టింట వైరల్ అవుతూ.. అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవలే తమ కుటుంబానికి సంబంధించిన ఒక ఫంక్షన్లో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను కృష్ణ కూతురు, మహేశ్ బాబు అక్క మంజుల సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫొటోలో కృష్ణ మొహంలో ఏదో తేడాగా కనిపిస్తుండటంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.