Asianet News TeluguAsianet News Telugu

సర్ ప్రైజ్ చేసిన తేజా సజ్జా.. Hanu-Man నుంచి సూపర్ హీరో సాంగ్ విడుదల.. విన్నారా?

చిల్డ్రన్స్ డే సందర్భంగా తేజా సజ్జా సర్ ప్రైజ్ ఇచ్చారు. చాలా రోజుల నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వని ‘హానుమాన్’ మూవీ నుంచి అదిరిపోయే సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో మోగుతోంది. 

Super Hero Hanuman Song Released from Teja Sajjas HanuMan Movie NSK
Author
First Published Nov 14, 2023, 5:53 PM IST | Last Updated Nov 14, 2023, 5:55 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja) నటిస్తున్న సూపర్ హీరో ఫిల్మ్ ‘హను మాన్’ (Hanu Man).  ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈచిత్ర టీజర్ విజువల్  వండర్ గా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచేసింది. యంగ్ హీరో నుంచి ఇంత అద్భుతమైన సినిమా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అయ్యింది. టీమ్ కూడా అప్డేట్స్ ను అదే స్థాయిలో విడుదల చేస్తున్నారు. 

ప్రతి ఫెస్టివల్, స్పెషల్ డేస్ లో తేజా సజ్జా చిత్రం నుంచి ఏదోక అప్డేట్ ఇస్తూ సినిమాను మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా సర్ ప్రైజ్ ఇచ్చారు. చిత్రం నుంచి Super Hero Hanu Man అనే సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతానికి మూవీ నుంచి ఇదే మొదటి పాట కావడం విశేషం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తుండటంతో అప్డేట్లను కూడా అన్నీ భాషల్లో వదులుతున్నారు. తాజాగా విడుదల చేసిన సాంగ్ నూ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేశారు. 

పిల్లలకు మరోసారి వెండితెరపై సూపర్ హీరోను పరిచయం చేస్తూ ఈ సాంగ్ ను సాగింది. లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సూపర్ మ్యాన్ పవర్స్ ను వివరిస్తూ సాగిన పాట ఆకట్టుకుంటోంది. విజువల్స్, మ్యూజిక్ అద్బుతంగా ఉన్నాయి. కార్టూన్ కూడా ఆకట్టుకునేలా ఉండటం విశేషం. కృష్ణ కాంత్ మంచి లిరిక్స్ అందించారు. సాయి వేదా వాగ్దేవి, ప్రకృతి రెడ్డి, మయూక్ చక్కగా పాడారు. అనుదీప్ దేవ్ క్యాచీ ట్యూన్ ను అందించారు. 

ఇప్పటికే టీజర్ విడుదలై హ్యూజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మెస్మరైజింగ్ విజువల్స్, సూపర్ బీజీఎం, గ్రాఫిక్ వర్క్ అద్బుతంగా ఉంది. సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.  ఇక ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా 11 దేశాల్లో రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది. వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios