Asianet News TeluguAsianet News Telugu

Sunny leone: సంప్రదాయ దుస్తుల్లో సన్నీలియోన్, షాక్ అవుతున్న నెటిజన్లు..

ఆడియన్స్ కు... నెటిజన్లకు షాక్ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్. అందరు ఆశ్చర్యపోయే విధంగా సంప్రాయద దుస్తుల్లో కనిపించి మురిపించింది. ఇంతకీ సన్నీలియోన్ లో ఈ చేంజ్ ఏంటి..? 
 

Sunny leone special Traditional Look For Ganga Harathi JmS
Author
First Published Nov 17, 2023, 12:29 PM IST

సన్నీలియోన్..  ప్రపంచవ్యాప్తంగా పోస్ట్ స్టార్ గా అందరికి సుపరిచితమైన వ్యక్తి.  హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ.. అదరిపోయే సొగసులు సోషల్ మీడియాలో పరిచేసి.. పరువాలతో పదనిసలు పలికిస్తూ.. ఫ్యాన్స్ కు కనుల విందు చేసే బాలీవుడ్ బ్యూటీ.. అసలు ఎవరూ ఊహించని లుక్ లో దర్శనం ఇచ్చింది.  పోర్న్‌స్టార్‌గా కెరియర్‌ను స్టార్ట్ చేసిన సన్నీలియోన్... నటిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు. 

నటిగా, హాట్ స్టార్ గా ఎంతో మంది తభిమానులను సంపాదించుకున్న సన్నీ లియోన్.. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో కూడా ఫుల్ బిజీ అయిపోయింది. తెలుగు సినిమాల్లో ఎక్కువగా అవకాశాలుసాధిస్తోంది బ్యూటీ. స్పెషల్ సాంగ్స్ చేస్తూ సందడి చేస్తోంది.  సినిమాలతో బిజీగా ఉన్న ఆమె నిన్న వారణాసిలో గంగాహారతికి హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ఆమె భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. 

 

సన్నీ లియోన్ పూజలు చేయడం.. ఆ అందుకు సంబంధించిన వీడియో ఒకటిసోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. దాంతో అంతా షాక్ అవుతున్నారు. సన్నీ లియోన్ సంప్రదాయ దుస్తుల్లో.. అది కూడా  పింక్ డ్రెస్‌, మెడలో దండతో కార్యక్రమానికి హాజరైంది.  పండితులు పూజలు చేస్తుంటే రెండు చేతులు కలిసి నమస్కరిస్తూ..కనిపించింది.  ఆమెతోపాటు నటుడు అభిషేక్ కూడా ఉన్నారు. 

 


ఇక హాట్ స్టార్ గా ఉన్న సన్నీ ఇలా రావడంతో అక్కడ ఆమెను  చూసేందుకు జనం ఎగబడ్డారు. హాట్ హాట్ గా ఉండే సన్నీలియోన్.. ఇలా కనిపించేసరికి అంతా విచిత్రంగా చూస్తున్నారు. ఇక ఆమె..  అభిషేక్ సింగ్ కలిసి చేసిన థర్డ్ పార్టీ మ్యూజిక్ వీడియోను బుధవారం విడుదల చేశారు. ఈ పాటను అభిషేక్ సింగ్ రాసి, పాడడమే కాకుండా కంపోజ్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios