శృంగారతార గా ఓ వెలుగు వెలిగిన సన్నీ లియోన్ ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని హీటెక్కిస్తోన్న విషయం తెలిసిందే. జయాపజయాలతో సంబంధం లేకుండా సన్నీ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇక అప్పుడపుడు బాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో స్పెషల్ సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేస్తోంది. 

ఇకపోతే త్వరలో బేబీ కామసూత్ర అనే ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సన్నీ లియోన్ కి సంబందించిన ఏ న్యూస్ వచ్చినా నిమిషాల్లో వైరల్ అవ్వడం కామన్. ఇక అదే విధంగా ఇప్పుడు సన్నీ లియోన్ 'కామసూత్ర' అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్స్ మొదలయ్యాయి. బాలీవుడ్ దర్శకురాలు ఏక్తా కపూర్ ఈ అడల్ట్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిననున్నారు. 

గతంలో ఏక్తా కపూర్ సన్నీ లియోన్ కాంబినేషన్ లో రాగిణి MMS 2 అనే సినిమా వచ్చింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాలను అందించింది. ఇక ఇప్పుడు కామసూత్ర కాన్సెప్ట్ తో మరోసారి సక్సెస్ అందుకోవాలని ఈ కాంబో సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది. ప్రస్తుతం సన్నీ లియోన్ వీర మాదేవి అనే ఒక హిస్టారికల్ కథలో నటిస్తున్నారు. ఆ సినిమా బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ కానుంది.