మంచు విష్ణు, పాయల్‌రాజ్‌పుత్, సన్నీలియోన్ కలిసి నటిస్తున్న `జిన్నా` చిత్రంలోని సన్నీలియోన్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో ఆమె లుక్ చాలా హాట్‌గా ఉండటం విశేషం.
బాలీవుడ్ శృంగార తార తెలుగులో పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్న చిత్రం `జిన్నా`(Ginna). మంచు విష్ణు హీరో(Manchu Vishnu)గా రూపొందుతున్న ఈ చిత్రంతో సన్నీలియోన్(Sunny Leone)తోపాటు పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రంలోని సన్నీలియోన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో ఆమె రేనుక పాత్రలో కనిపించబోతుంది. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో జాకెట్ విప్పేసి మరీ పొట్టిదైన పింక్ స్కర్ట్ ధరించి థైస్ అందాలను చూపిస్తూ కనిపిస్తుంది సన్నీలియోన్, మరోవైపు బ్రా అందాలు చూపిస్తూ ఆర్టీసీ బస్ నుంచి దిగుతున్న సన్నీలియోన్ లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ కి గ్లామర్ ఫీస్ట్ మామూలుగా ఉండబోదనే సాంకేతాలనిస్తుంది. పల్లెటూరొచ్చిన పట్నం పిల్లలా సన్నీలియోన్ పాత్ర ఉండబోతుందని తాజా ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతుంది.
తెలుగులో ఆమెని చూడాలని ఆడియెన్స్, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, సినిమాలో ఆమె పాత్ర కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న నేపథ్యంలో తాజాగా లుక్ వారిని ఖుషి చేస్తుందని చెబుతుంది యూనిట్. లేటెస్ట్ సన్నీలియోన్ ఫస్ట్ లుక్ సినిమాపై బజ్‌ని క్రియేట్ చేసిందని తెలిపింది. ఇంకా యూనిట్ తెలియజేస్తూ, తెలుగు తమిళం, మలయాళం, హిందీ నాలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని తెలిపింది.
`కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న `జిన్నా` రోజురోజుకు మంచి బజ్‌ని సోంతం చేసుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో విష్ణుతో సన్నీ రీల్స్, విష్ణు, ఆయన బృందంతో సన్నీ ఓ చమత్కారమైన రీల్స్ విడుదల చేసి ప్రేక్షకులను ఆకర్షించారు. 'నాటు నాటు' ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ చిత్రానికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారని చెప్పింది యూనిట్.
తన ఫస్ట్ లుక్‌పై సన్నీలియోన్ రియాక్ట్ అవుతూ, తాను నటిస్తున్న రేణుక పాత్రని పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, జిన్నాకి తాను చిన్ననాటి స్నేహితురాలిని అని, కానీ ఆయన జీవితాన్ని తలక్రిందులుగా చేయనని కాదని, ఇది ఊహించని మలుపులతో సాగే క్రేజీ జర్నీ అని తెలిపింది సన్నీలియోన్.
